Begin typing your search above and press return to search.

ఆచార్య లీక్ః మొత్తం సస్పెన్స్ రివీల్ అయ్యింది

By:  Tupaki Desk   |   8 March 2021 3:31 AM GMT
ఆచార్య లీక్ః మొత్తం సస్పెన్స్ రివీల్ అయ్యింది
X
ఆచార్య సినిమా మొదలు పెట్టినప్పటి నుండి కూడా క్రేజ్ వల్లో లేదా మరే కారణమో కాని ఏదో ఒక మాదిరిగా ఫొటోలు మ్యాటర్ లు లీక్ అవుతూనే ఉన్నాయి. ఆచార్య ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ కంటే ముందే చిరు లుక్‌ రివీల్‌ అయ్యింది. ఆ తర్వాత కూడా వరుసగా పలు ఆన్‌ లొకేషన్‌ పిక్స్ లీక్‌ అవుతూనే ఉన్నాయి. ఇన్ని ఫొటోలు లీక్ అయినా కూడా చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లు ఈ సినిమా లో ఏంటీ అనే విషయం పై స్పష్టత లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఇటీవల లీక్ అయిన ఫొటోతో మొత్తం సస్పెన్స్‌ రివీల్‌ అయినట్లయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమా ఖమ్మం జిల్లా ఇల్లందు జేకే మైన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలం అయ్యారు. దాంతో చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశంకు అతి సమీపంలోకి అభిమానులు వెళ్లి పోయారు. చిరంజీవి మరియు చరణ్‌ లు ఆర్మీ డ్రస్ లో ఉన్న ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పటికే చిరంజీవి మరియు చరణ్‌ లు నక్సలైట్లుగా కనిపించబోతున్నట్లుగా టాక్ ఉంది. ఈ ఫొటోతో ఆ సస్పెన్స్‌ రివీల్ అయినట్లయ్యింది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ పిక్‌ లీక్‌ అవ్వడం పట్ల అసంతృప్తితో ఉన్నారు.