Begin typing your search above and press return to search.

#ఆచార్య‌.. చ‌ర‌ణ్ ప్రీలుక్ `సిద్ధ` సిద్ధం

By:  Tupaki Desk   |   17 Jan 2021 5:43 AM GMT
#ఆచార్య‌.. చ‌ర‌ణ్ ప్రీలుక్ `సిద్ధ` సిద్ధం
X
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. కాజ‌ల్ క‌థానాయిక. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. చ‌ర‌ణ్ ఇందులో 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర‌లో అదర‌గొట్టేయ‌బోతున్నాడు. దేవాదాయ శాఖ అవినీతి కుంభ‌కోణాల నేప‌థ్యంలో ఆద్యంతం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని తెర‌పైకి తెస్తున్నార‌ని స‌మాచారం.

ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టోన్ ఏమిటో వెల్ల‌డించే వీడియోని రిలీజ్ చేశారు. ఈ మూవీకి అత్యంత కీల‌క‌మైన ఆల‌య ప్రాంగ‌ణంపై స్వ‌యంగా వివ‌రాల్ని అందించి ఆశ్చ‌ర్య‌పరిచారు. తొలి నుంచి ఆచార్య టైటిల్ స‌హా ఏదీ స‌స్పెన్స్ లేకుండా చిరు గుట్టు విప్పేస్తుండ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇంత‌కుముందు రిలీజైన ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ కి మెగాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. చిరంజీవి ఈ సినిమాలో పూర్తి భిన్న‌మైన పాత్ర‌తో అల‌రించ‌నున్నార‌ని అర్థ‌మైంది.

తాజాగా ఈ మూవీ నుంచి చ‌ర‌ణ్ ప్రీలుక్ రివీలైంది. ఫ‌స్ట్ లుక్ కి ముందు ఈ లుక్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ``మా `సిద్ధ` సర్వం సిద్ధం...`` అంటూ కొర‌టాల స్వ‌యంగా రామ్ చరణ్ ప్రీ లుక్ రివీల్ చేస్తూ స‌స్పెన్స్ కి తెర దించేశారు. ఆల‌యంలోకి ప్ర‌వేశిస్తున్న సిద్ధునిగా రాంచరణ్ లుక్ ని ఆవిష్క‌రించ‌గా.. అత‌డి ఫేస్ రివీల్ కాకుండా వెన‌క వైపు నుంచి లుక్ ని రివీల్ చేశారు. దూరంగా ఆల‌యం బ్ల‌ర్ మోడ్ లో క‌నిపిస్తోంది. ఇక చ‌ర‌ణ్ మెడ‌లో రుద్ర‌క్ష‌లు.. చెవి రింగు హైలైట్ గా క‌నిపిస్తున్నాయి. ఈ లుక్ ప్ర‌స్తుతం చెర్రీ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది.

`సిద్ధ` మ‌రీ ఇంత సైలెంట్ గా ఉన్నాడు. వ‌యోలెన్స్ కూడా అంతే ఇదిగా ఉంటుందా? అన్న డౌట్లు పుట్టుకొచ్చేస్తున్నాయ్. ఆల‌యంలోకి చెర్రీ ఎంట్రీ మొద‌లు దుమారం రేగుతుంద‌న్న అప్ డేట్ ఇంత‌కుముందే రివీల్ కావ‌డంతో తాజా ప్రీలుక్ తో అభిమానుల్లో అంచ‌నాలు అమాంతం పెరిగాయి. తాజాగా చిత్ర బృందం ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రామ్ చరణ్ షూట్ లో జాయిన్ కానున్నార‌ని వెల్ల‌డించింది. చ‌ర‌ణ్ ఇక‌పై ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి భాయ్ చెప్పేసి కొర‌టాల టీమ్ తో జాయిన్ అవుతుండ‌డం ఉత్కంఠ‌ను పెంచేస్తోంది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ బాణీల్ని సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.