Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఆచారి పూజలు ఫలిస్తాయా

By:  Tupaki Desk   |   7 Jan 2018 9:30 AM GMT
టీజర్ టాక్: ఆచారి పూజలు ఫలిస్తాయా
X
మంచు విష్ణు హీరోగా కామెడీ సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకున్న దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఆచారి అమెరికా యాత్ర టీజర్ ఇందాకా అఫీషియల్ గా విడుదలైంది.,తీసుకునేవి సింపుల్ కథలే అయినా తన కామెడీ టైమింగ్ తో మెప్పించే నాగేశ్వర్ రెడ్డి ఇందులో కూడా అదే ఫాలో అయినట్టు కనిపిస్తోంది. పౌరోహిత్యం చేసుకునే విష్ణు తన గురువు బ్రహ్మానందంని అమెరికాకు తీసుకెళతాడు. అక్కడ వాళ్ళిద్దరూ పడే అగచాట్లు - ఒక ప్రేమ కథ - ఒక విలన్ అంతా ఒక ఫార్ములా ప్రకారం వెళ్లిపోయింది. ప్రగ్యా జైస్వాల్ హీరొయిన్ గా నటించిన ఈ మూవీలో అనూప్ సింగ్ టాకూర్ - ప్రదీప్ రావత్ విలన్లు గా నటించారు. కోట శ్రీనివాసరావు మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

తమన్ మ్యూజిక్ క్యాచీగానే అనిపిస్తోంది. విష్ణుది - నాగేశ్వర్ రెడ్డిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. గతంలో వచ్చిన దేనికైనా రెడీ - ఈడో రకం ఆడో రకం హిట్స్ కాగా దాని తర్వాత వస్తున్న మూడో సినిమా ఇది. నాగేశ్వర్ రెడ్డి వాటి తర్వాత తీసిన ఆటాడుకుందాం రా - ఇంట్లో దెయ్యం నాకేం భయం ఫ్లాప్ అయ్యాయి. మంచి విష్ణు కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదుర్స్ - దేనికైనా రెడీ పోలికలు కనిపిస్తున్నా కామెడీ తో ఎంత వరకు మెప్పించారు అనేదాన్ని బట్టి ఆచారి అమెరికా యాత్ర విజయం ఆధారపడి ఉంటుంది.