Begin typing your search above and press return to search.

తేజ మరో ఉదయ్‌ కిరణ్‌ ను పట్టుకోగలడా?

By:  Tupaki Desk   |   31 July 2020 11:20 AM IST
తేజ మరో ఉదయ్‌ కిరణ్‌ ను పట్టుకోగలడా?
X
దర్శకుడు తేజ తన మొదటి సినిమా ‘చిత్రం’ కు సీక్వెల్‌ ను చేసే ఆలోచనలో ఉన్నాడనే విషయం తెల్సిందే. ప్రస్తుతం చేస్తున్న అలిమేలుమంగ వెంకటరమణ చిత్రంతో పాటు చిత్రం సీక్వెల్‌ పనుల్లో కూడా తేజ బిజీగా ఉన్నాడు. అలిమేలుమంగ వెంకటరమణ చిత్రాన్ని గోపీచంద్‌ తో తెరకెక్కిస్తున్న తేజ ‘చిత్రం’ సీక్వెల్‌ కోసం మాత్రం కొత్త హీరోను వెదుకుతున్నాడు. ‘చిత్రం’తో ఉదయ్‌ కిరణ్‌ ను పరిచయం చేసిన దర్శకుడు తేజ సీక్వెల్‌ తోనూ మరో హీరోను పరిచయం చేయాలని భావిస్తున్నాడు. సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వ్యక్తిని సీక్వెల్‌ కు హీరోగా ఖరారు చేయాలని భావిస్తున్నాడు.

బోల్డ్‌ కంటెంట్‌ తో ఈ సీక్వెల్‌ ఉంటుందని టాక్‌ వినిపిస్తుంది. అందుకోసం నటుడిగా మంచి ప్రతిభ కనబర్చే నటుడిని పట్టుకునేందుకు తేజ కొన్ని రోజుల క్రితం ఆడిషన్స్‌ ను కూడా నిర్వహించారు. కొందరిని జూమ్‌ ద్వారా ఇంటర్వ్యూ చేసిన తేజ ఇప్పటికే కొందరిని ఎంపిక చేశాడు. కాని హీరో పాత్రకు మాత్రం ఇంకా నటుడు దొరకలేదని తెలుస్తోంది. ఉదయ్‌ కిరణ్‌ వంటి ఫిజిక్‌ మరియు బాడీలాంగ్వేజ్‌ ఉన్న 20 ఏళ్ల లోపు కుర్రాడిని పట్టుకునేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నాడు.

చిన్న వయసులోనే నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు స్టార్‌ గా పేరు దక్కించుకున్న ఉదయ్‌ కిరణ్‌ స్థాయి నటుడిని అలాంటి వ్యక్తిని ఇప్పుడు పట్టుకోవడం అంటే కాస్త కష్టమే. దర్శకుడు మరో ఉదయ్‌ కిరణ్‌ ను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి. ఉదయ్‌ కిరణ్‌ పాత్రకు నటుడు దొరికితే సీక్వెల్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అంటున్నారు.