Begin typing your search above and press return to search.

`ఎఫ్‌3` ఆఫ‌ర్ .. ఆ మూడో హీరో ఫేట్ మారుస్తుందా?

By:  Tupaki Desk   |   16 Oct 2020 2:00 PM IST
`ఎఫ్‌3` ఆఫ‌ర్ .. ఆ మూడో హీరో ఫేట్ మారుస్తుందా?
X
విక్ట‌రీ వెంక‌టేష్‌.. వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన ఫ‌న్ రైడ‌ర్ `ఎఫ్ 2`. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల మార్కుని దాటి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ క్రేజీ చిత్రానికి సీక్వెల్ ని చేయబోతున్నానంటూ లాక్ డౌన్ స‌మ‌యం నుంచి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి నుంచి లీకులు వ‌స్తూనే వున్నాయి.

అయితే ఈ స‌మ‌యంలో వెంక‌టేష్ `నార‌ప్ప‌` షూటింగ్ లో బిజీగా వుండ‌టం .. వ‌రుణ్ తేజ్‌బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తుండ‌టంతో `ఎఫ్ 3` సెట్స్ పైకి రావాలంటే మ‌రి కొంత స‌మ‌యం వేచి చూడాల్సిన ప‌రిస్థితి. దీంతో మ‌రో సినిమాని ట్రాక్ లోకి తీసుకురావాల‌నుకుంటున్నార‌ట అనిల్ రావిపూడి. ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ఇందులో సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఇదిలా వుంటే `ఎఫ్ 3`ని మ‌రింత ఫ‌న్ రైడ్ గా తీర్చి దిద్దాల‌న్న ఆలోచ‌న‌తో ఈ మూవీ కోసం మ‌రో హీరోని ట్రాక్ లోకి తీసుకొస్తున్నార‌ట‌. ఆ హీరో సునీల్ అని తెలిసింది. ఈ సీక్వెల్ లో సునీల్ కీ రోల్‌లో పూర్తి స్థాయి పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. ఫుల్ లెంగ్త్ పాత్ర‌ల్లో సునీల్ న‌టించిన సొంతం.., ఆడుతూ పాడుతూ...పెళ్లాం ఊరెళితే.., నువ్వులేక నేను లేను చిత్రాలు ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాల్లో సునీల్ త‌న‌దైన మార్కు కామెడీ పంచ్ డైలాగ్ ల‌తో హ‌లేరియ‌స్‌గా న‌వ్వించాడు. `ఎఫ్ 3`లోనూ అదే స్థాయి కామెడీతో ఆక‌ట్టుకోబోతున్నాడ‌ని తెలిసింది.