Begin typing your search above and press return to search.
'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్' నుంచి అమ్ము అభిరామి లుక్..!
By: Tupaki Desk | 28 Dec 2020 1:30 PM ISTశ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ఎల్. దామోదర్ ప్రసాద్ ''ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్'' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు - రామ్ కార్తీక్ - అమ్ము అభిరామి - బాల నటి సహశ్రిత ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే అధికారికంగా వివరాలు ప్రకటించబడిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫాదర్ గా జగపతిబాబు.. చిట్టిగా సహశ్రిత లుక్స్ ని విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా థర్డ్ పోస్టర్ ద్వారా అమ్ము అభిరామి లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ఆమె డాక్టర్ ఉమ పాత్రలో కనిపించనుంది.
తాజాగా విడుదలైన 'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్' పోస్టర్ లో అమ్ము శారీలో సింపుల్ గా ఉండటంతో పాటు అందంగా కనిపిస్తోంది. అమ్ము అభిరామి తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన 'అసురన్' సినిమాతో బాగా ఫేమస్ అయింది. 'రాక్షసుడు' తెలుగు రీమేక్ తో ఇక్కడి ఆడియన్స్ ని కూడా పలకరించింది. ఇప్పుడు 'ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. తన అభినయంతో తమిళ ప్రేక్షకులను మెప్పించిన టాలెంటెడ్ అమ్ము అభిరామి.. తెలుగు ఆడియన్స్ ని కూడా అలరిస్తుందేమో చూడాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా శివ.జి ఛాయాగ్రహణం అందించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అలీ - దగ్గుబాటి రాజా - కళ్యాణి నటరాజన్ - బ్రహ్మాజీ - కృష్ణ భగవాన్ - రజిత - జబర్దస్త్ రామ్ ప్రసాద్ - నవీన్ - వెంకీ - రాఘవ - భరత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.