Begin typing your search above and press return to search.

#సామ్ జామ్‌.. ఆ `బిగ్ బాస్ 4` హీరో జాక్ పాట్

By:  Tupaki Desk   |   19 Dec 2020 2:00 PM GMT
#సామ్ జామ్‌.. ఆ `బిగ్ బాస్ 4` హీరో జాక్ పాట్
X
అక్కినేని కోడ‌లు స‌మంత వ‌రుస‌గా సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూల‌తో సామ్ జామ్ కార్య‌క్ర‌మాన్ని పెద్ద స‌క్సెస్ చేస్తున్నారు. ఆహా- తెలుగు ఓటీటీలో వ‌రుస ఇంట‌ర్వ్యూల హంగామా గురించి తెలిసిన‌దే.

ఇక ఇదే వేదిక‌పై ప్ర‌స్తుతం స్టార్ మాలో టెలీకాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ఇంటి స‌భ్యుడు అభిజీత్ కి జాక్ పాట్ త‌గిలింద‌ని తెలిసింది. అత‌డు ఇంటి నుంచి బ‌య‌టికి రాగానే సామ్ జామ్ వేద‌క‌పై సంద‌డి చేస్తాడ‌ట‌. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో అభిజీత్ గుట్టు మ‌ట్లు మొత్తం లీకైపోవ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు. బిగ్ బాస్ లోటుపాట్లు.. ఆ ఇంట్లో జ‌రిగే చాలా విష‌యాల్ని ఇలాంటి వేదిక‌ల‌పై సూటిగా చెప్పేయొచ్చు. బిగ్ బాస్ తో పెరిగిన ఇమేజ్ కి అనుగుణంగా సినిమాల‌కు అత‌డు సంత‌కాలు చేసే వీలుంటుంది.

ఇక బిగ్ బాస్ స్టార్లంతా వ‌రుసగా యూట్యూబ్ చానెళ్లు.. టీవీ చానెళ్ల ఇంట‌ర్వ్యూల‌లో సంద‌డి చేసేస్తుంటారు ప్ర‌తిసారీ. ఈసారి ఫైన‌ల్ కంటెస్టెంట్స్ లో విజేత ఎవ‌రో తేలాల్సి ఉంది ఇంకా. అభిజీత్ రేస్ లో ఉన్నారు కాబ‌ట్టి ఇప్ప‌టికే సామ్ జామ్ నుంచి ఇన్విటేష‌న్ అందింద‌ట‌.
నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదంటూ హోస్ట్ సమంత అత‌డి గుట్టంతా ర‌ట్టు చేస్తుంద‌న్న‌మాట‌. ఫ‌న్ తో పాటు సీక్రెట్స్ ని బ‌య‌ట‌పెట్ట‌డంతోనే ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస‌వుతోంది.