Begin typing your search above and press return to search.

లయన్ పక్కనే రావాల్సింది.. కాని..

By:  Tupaki Desk   |   30 July 2015 9:38 PM IST
లయన్ పక్కనే రావాల్సింది.. కాని..
X
లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు అభిజీత్‌. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రమిది. హ్యాపీడేస్‌ అంత సక్సెస్‌ కాకపోవడంతో ఈ చిత్రంలో నటించిన నటీనటులకు ఆశించినంత గుర్తింపు, స్టార్‌ డమ్‌ రాలేదు. కానీ అందులోంచి అభిజీత్‌ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో టాలీవుడ్‌ లో పోరాటం సాగిస్తున్నాడు. అతడు మొక్కవోని ధీక్ష తో హీరోగా తనని తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. తాజాగా అతడు నటించిన 'మిర్చిలాంటి కుర్రాడు' రిలీజ్‌ కి వస్తోంది. ఈ సందర్భంగా అతడి ముచ్చట్లివి.....

= లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ తర్వాత అమెరికా వెళ్లిపోయాను. అక్కడ ఉంటుండగానే మిర్చిలాంటి కుర్రాడు కథ విన్నాను. ఆ సినిమాలో నటించడం కోసమే ఇండియా వచ్చాను. ఇప్పుడు సినిమా రిలీజవుతోంది.

=వాస్తవానికి బాలకృష్ణ లయన్‌ రిలీజ్‌ టైమ్‌ లోనే రావాల్సింది. కానీ పెద్ద సినిమాతో పోటీ ఎందుకు? అందుకే వాయిదా వేశాం.

=ఈ చిత్రంతో జయ్‌ నాగ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదో లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌. అందరినీ ఆకట్టుకునే అన్ని కమర్షియల్‌ హంగులు ఉన్నాయి.

=సిద్దూ అనే కుర్రాడు ఒకే అమ్మాయిని ప్రేమించి జీవితాంతం తనకోసమే అంకితమై ఉంటాడు. అదే ఈ సినిమా.

=ఇప్పటికైతే ఏ సినిమాకి సంతకం చేయలేదు. కథలు వింటున్నా.