Begin typing your search above and press return to search.

వీడియోః తిరిగి ఇచ్చేందుకు శాంటా గా మారిన బిబి4 విన్నర్‌

By:  Tupaki Desk   |   25 Dec 2020 11:30 AM GMT
వీడియోః తిరిగి ఇచ్చేందుకు శాంటా గా మారిన బిబి4 విన్నర్‌
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 విన్నర్ గా మిస్టర్‌ కూల్‌ అభిజిత్ నిలిచాడు. హౌస్‌ లో ఉన్న సమయంలో చాలా హుందాగా బ్యాలన్స్‌ గా కనిపించిన అభిజిత్‌ బయటకు వచ్చిన తర్వాత తనలోని మాస్ యాంగిల్‌ ను ఆవిష్కరిస్తున్నాడు. స్నేహితులతో పార్టీలు పబ్‌ లు మీట్ అండ్‌ గ్రీట్‌ లు ఇలా అన్ని విధాలుగా చిల్ అవుతున్నాడు. బిగ్‌ బాస్ హౌస్‌ లో ఉన్న సమయంలో తనకు మద్దతుగా నిలిచి వారికి తనకు సహకరించిన వారికి తిరిగి చెల్లించే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా కలిసి మరీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఇప్పటికే మెగా బ్రదర్‌ నాగబాబును కలిసిన అభిజిత్‌ నేడు క్రిస్మస్‌ సందర్బంగా శాంటా క్లాజ్‌ వేశం వేసుకుని తన సన్నిహితులు మిత్రుల వద్దకు బహుమతులు పట్టుకుని వెళ్లాడు.

శాంటా క్లాజ్ వేషంలో ఉన్న అభిజిత్‌ చాలా హుషారుగా కనిపించాడు. హౌస్‌ లో ఉన్న సమయంలో చాలా మంది నాకోసం చాలా చేశారు. వారందరికి తిరిగి చెల్లించాల్సిన సమయం. వారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్‌ కానుకలు ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు. హైదరాబాద్‌ లో ఉన్న చాలా మందికి అభిజిత్‌ శాంటా రూపంలో బహుమానాలు ఇవ్వబోతున్నాడు. తెలిసిన వారికి మాత్రమే కాకుండా తెలియని వారికి కూడా అభి నుండి బహుమతులు అందబోతున్నాయి. ఇక అభి బిబి తర్వాత సినిమాల్లో బిజీ అవుతాననే నమ్మకంతో ఉన్నాడు. తనను విజేతగా నిలిపిన వారికి తిరిగి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఇస్తానంటూ నమ్మకంగా చెబుతున్నాడు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://twitter.com/Abijeet/status/1342361583368896512