Begin typing your search above and press return to search.

వరుణ్‌ తేజ్‌ రేంజ్‌ ఎంత అసలు?

By:  Tupaki Desk   |   18 Nov 2015 5:31 AM GMT
వరుణ్‌ తేజ్‌ రేంజ్‌ ఎంత అసలు?
X
పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా వారసుడు వరుణ్ తేజ్ నటిస్తున్న లోఫర్ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. వీటికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పుడు లోఫర్ నైజాం రైట్స్ కోసం అభిషేక్ పిక్చర్స్ ఏకంగా ఏడున్నర కోట్లు వెచ్చించిందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

అంచనాలు ఉన్నాయని కొత్త హీరోలపై ఫ్యాన్సీ ప్రైస్ పెట్టడం అంత కరెక్ట్ కాదని రీసెంట్ గానే ప్రూవ్ అయింది. అఖిల్ అరంగేట్ర మూవీ అఖిల్ కోసం అన్ని ఏరియాల్లోనూ భారీగానే బిజినెస్ చేశారు. నైజాం ఏరియాని నిర్మాత నితిన్ సొంతగానే రిలీజ్ చేసినా..బిజినెస్‌ అంతా ఒక 10 నుండి 13 కోట్లు ఉంటుందని ట్రేడ్‌ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఇప్పుడా సినిమా పరిస్థితి కనిపిస్తూనే ఉంది. పెట్టుబడిలో 60శాతం ఎగిరిపోతుందని అంటున్నారు. మరిప్పుడు తేజ్‌ కోసం 7.5 కోట్లు పెట్టడం ఆశ్చర్యకరమే. అసలు మనోడి రేంజ్‌ అంతుందా అనేదే పాయింట్.

వరుణ్ తేజ్ మార్కెట్ ని అంచనా వేయడం కష్టం. చేసిన రెండింటిలో కంచె కలెక్షన్స్ తెచ్చినా.. అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఇప్పుడు రెడీ అయిన లోఫర్ పక్కా మాస్ పిక్చర్. కాకపోతే.. ఇప్పుడు డైరెక్టర్ ని చూసి మార్కెట్ జరుగుతోందని అర్ధం చేసుకోవచ్చు. దీనికి మెగా ఫ్యామిలీ హీరో అన్నది యాడాన్ అడ్వాంటేజ్. అయినా సరే కొత్త హీరోపై ఇంతింత పెట్టేయడమంటే రిస్క్ అనే చెప్పాలి. ఇదంతా జరిగే పనేనా? వసూలు అవుతుందా అనిపించినా.. ఒక వేళ కలెక్షన్స్ వస్తే మాత్రం.. మెగా హీరోకి మాస్ లైన్ క్లియర్ అయినట్లే.