Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో
By: Tupaki Desk | 26 Nov 2020 11:10 PM ISTబాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ హీరోగా సక్సెస్ కాలేక పోయాడు. అయితే నటుడిగా మాత్రం ఆయనకు మంచి మార్కులు పడతాయి. అదృష్టం సరిగా లేక స్టార్ హీరో అవ్వలేక పోయిన అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే వెబ్ సిరీస్ లు మరియు చిన్న సినిమాలు చేసేందుకు సిద్దం అయిన అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బాబ్ బిస్వాస్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ లుక్ అందరికి షాకింగ్ గా మారింది.
జూనియర్ బిగ్ బి అంటూ పిలిపించుకుంటున్న అభిషేక్ బచ్చన్ సినిమాలోని పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఒక అంకుల్ మాదిరిగా మిడిల్ ఏజ్ వ్యక్తిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ లుక్ కు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఫిదా అవుతున్నారు. పాత్ర కోసం ఎంత మారారు మీరు అంటూ అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా సమయంలో దాదాపు నెల రోజులు పూర్తిగా ఆసుపత్రికే పరిమితం అయ్యాడు. ఆ సమయంలో అభిషేక్ కాస్త బరువు పెరిగాడు. అది మళ్లీ తగ్గినట్లుగా లేదు. అందుకే ఈ ఫొటోలో బరువు ఎక్కువ అయినట్లుగా కూడా కనిపిస్తున్నాడు.