Begin typing your search above and press return to search.

'మిస్టర్ పర్ఫెక్ట్'తో నేను నటించను: అభిషేక్ బచ్చన్

By:  Tupaki Desk   |   27 Jun 2020 10:33 PM IST
మిస్టర్ పర్ఫెక్ట్తో నేను నటించను: అభిషేక్ బచ్చన్
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఆమీర్‌ఖాన్‌ అనే చెప్తారు. ఎందుకంటే ఆయన సినిమాల సెలక్షన్ అలా ఉంటుంది. ఒక సినిమాకి ఒకటి పోలిక లేకుండా బ్రిలియంట్ మైండ్ సెట్ తో తన కెరీర్ డెవలప్ చేసుకున్నాడు అమిర్. ఆయన సినిమాలలో కథకి ఎంతటి ముఖ్యపాత్ర ఉంటుందో సామాజిక సందేశానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటాడు అమిర్. ఇక అమిర్ నటన గురించి.. డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాకోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేస్తాడు. ఒక గజినీ.. త్రిఇడియట్స్.. పికె.. దంగల్.. ధూమ్ 3.. ఇలా ఒక్కో సినిమాలో తన నటన పీక్స్ అని చెప్పాలి. ఇక తాజాగా ఓ స్టార్ యాక్టర్ "అమిర్ ఖాన్ తో నేను సినిమాలలో నటించను" అని బహిరంగ ప్రకటన చేసాడు. అతనెవరో కాదు ధూమ్ సిరీస్ పోలీస్ అభిషేక్‌ బచ్చన్‌.

అమిర్ - అభిషేక్ కలిసి 2013లో ధూమ్ -3 చేశారు. పూర్తి యాక్షన్ సినిమాగా విడుదలైన ధూమ్-3 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో దొంగగా ఆమీర్‌.. పోలీస్‌ ఆఫీసర్‌గా అభిషేక్‌లు యాక్షన్‌ అదరగొట్టారు. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ ఆయనతో నటించను అనేసరికి అంతా షాక్ అయ్యారు. కానీ అభిషేక్ మాట్లాడుతూ.. ‘‘ధూమ్‌’... నా జీవితంలో వచ్చిన అరుదైన అవకాశం ఆమీర్‌తో నటించడం. నాకు మరో అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించను. ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. ఆమీర్‌ మీరు దీన్ని చదివి ఉంటే నా విన్నపాన్ని అంగీకరించండి. ఆయన తన సహనటులకు ఎంతో సహకరిస్తారు. అదే సమయంలో ఆయనలో అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. సరదాగా ఉంటారు’’ అని అభిషేక్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.