Begin typing your search above and press return to search.

రితేశ్ షో నుంచి వాకౌట్ చేసిన అభిషేక్ బచ్చన్..!

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:56 AM GMT
రితేశ్ షో నుంచి వాకౌట్ చేసిన అభిషేక్ బచ్చన్..!
X
బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ ముఖ్ 'కేస్ తో బన్ తా హై' అనే హిందీ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోలో కుష కపిల కూడా వ్యాఖ్యాతగా ఉంటున్నారు. తాజాగా హీరో అభిషేక్ బచ్చన్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తండ్రి బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ పై జోక్ వేయడంతో షో మధ్యలోనే వెళ్ళిపోయాడు.

'కేస్ తో బన్ తా హై' షోలో భాగంగా పరితోష్ త్రిపాఠి లెజండరీ నటుడు అమితాబ్ పై జోక్ వేశాడు. దీంతో జూనియర్ బచ్చన్ కోపానికి లోనయ్యాడు. షూటింగ్‌ ని ఆపేయాలని మేకర్స్‌ ను కోరిన అభిషేక్.. తాను ఫూల్‌ ని కాదని అసహనం వ్యక్తం చేశారు.

'నేను షోలో పాల్గొనడానికి వచ్చాను. తల్లిదండ్రులను ఇందులోకి లాగకండి. మీరు హద్దులను దాటుతున్నారు. నాపై జోక్స్ వేయండి. మా తండ్రిపై జోక్ వేస్తే నాకు బాగా అనిపించదు' అని అభిషేక్ బచ్చన్ నిర్వాహకులతో చెప్పి షో నుంచి వాకౌట్ చేసాడు.

ఈ ఘటనతో షోకు హోస్టులుగా వ్యవహరిస్తున్న రితేశ్ దేశ్‌ ముఖ్ - కుష కపిల తో పాటుగా అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్‌ కు సర్ది చెప్పడానికి పరిస్థితులను చక్కదిద్దేందుకు పరితోష్ మరియు 'కేస్ తో బన్ హై' మేకర్స్ ప్రయత్నించారు.

అయినప్పటికీ అభిషేక్ షూటింగ్‌ ను మధ్యలోనే వదిలివేసి షో నుంచి వెళ్లిపోయాడు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అభిషేక్ కు కూలెస్ట్ పర్సన్ గా - కామ్ గోయింగ్ గా యాక్టర్ గా అతడికి పేరుంది. అయితే ఇప్పుడు తన తండ్రి మీద జోక్ వేయడంతో బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

కపిల్ శర్మ షో తరహాలో సాగే 'కేస్ తో బన్ హై' కామెడీ ప్రోగ్రామ్ కి సెలబ్రిటీలు గెస్టులుగా వస్తుంటారు. ఇప్పటికే విక్కీ కౌశల్ - సారా అలీఖాన్ - సంజయ్ దత్ - అనిల్ కపూర్ వంటి సినీ ప్రముఖులు ఈ టాక్ షోలో సందడి చేశారు. ఈ క్రమంలో అభిషేక్ గెస్టుగా రావడం.. షో మధ్యలో వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.