Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో ఛాన్సివ్వరూ ప్లీజ్
By: Tupaki Desk | 20 Sept 2018 11:18 AM ISTఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ టాలీవుడ్‌లో ఆ ఒక్క ఛాన్స్ కోసం తిరిగేవారెందరో. ముంబై నుంచి టాప్ మోడల్స్ హైదరాబాద్ లో పాగా వేసి - ఇక్కడ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుంటారు. అదంతా సరే బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్ అంతటివాడే ఒక్క ఛాన్స్ ప్లీజ్! అన్నాడంటే కాస్తంత ఆలోచించాలి.
రెండున్నర దశాబ్ధాలుగా అభిషేక్ బాలీవుడ్ లో నటిస్తున్నాడు. బచ్చన్‌ల వారసుడిగా సినీఆరంగేట్రం చేసినా స్టార్ డమ్ ని నిలుపుకోవడంలో మాత్రం తడబడ్డాడు. ఇద్దరు ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్లు మాత్రమే అతడికి అంతో ఇంతో పేరు తెచ్చాయి కానీ - సోలో హీరోగా మార్కెట్ ని కొల్లగొట్టే సత్తా మాత్రం లేదని ప్రూవైంది. ఆ క్రమంలోనే వైఫ్ ఐశ్వర్యారాయ్ తో కలిసి సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు.
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అతడు నటించిన `మన్మార్జియాన్` రిలీజైంది. ఈ సినిమా హిట్టు అన్న టాక్ తెచ్చుకుంది. దీంతో మన్మార్జియాన్ హైదరాబాద్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ హుషారుగా కనిపించాడు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిషేక్ సందడి చేశాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో నటిస్తారా? అని తెలుగు మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించాడు. ఇక్కడ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.. సరైన స్క్రిప్టు వస్తే ఆలోచిస్తానని అన్నాడు. ఏదో అడిగారు కదా! అని అన్నాడో లేక నిజంగానే ఆ ఆలోచన ఉందో కానీ తొలినుంచి అతడు సౌత్ పైనా దృష్టి సారించి ఇక్కడివారికి దగ్గరయ్యే ప్రయత్నం చేసి ఉంటే అతడికి వేరే ఛాన్సులు దక్కేవేమో! అభిషేక్ - విక్కీ కౌశల్ - తాప్సీ తారాగణంగా అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.