Begin typing your search above and press return to search.
జూ.బచ్చన్ సినిమాల్లో ఫెయిలైనా..
By: Tupaki Desk | 1 Aug 2016 7:00 PM ISTఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అమితాబ్ బచ్చన్ వారసుడిగా ‘రెఫ్యూజీ’ సినిమాతో ఘనంగా తెరంగేట్రం చేశాడు అభిషేక్ బచ్చన్. ఐతే హీరోగా పరిచయమై దశాబ్దంన్నర దాటుతున్నా ఇప్పటికీ నిలదొక్కుకోలేదు అభిషేక్. సోలో హీరోగా అతను చేసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాపులే. ధూమ్.. బోల్ బచ్చన్.. హౌస్ ఫుల్ సిరీస్ సినిమాలు ఆడినా.. వాటిలో అతడిది సహాయ నటుడి పాత్ర. ఆ సినిమాలు హిట్టవడంలో అతడి పాత్ర నామమాత్రం. ఏదో బిగ్-బి కొడుకు కాబట్టి ఇంకా సినిమాల్లో కొనసాగగలుగుతున్నాడు కానీ.. లేదంటే మాత్రం జూనియర్ బచ్చన్ టాలెంటుకి ఎప్పుడో సినిమాల నుంచి నిష్క్రమించాల్సింది. ఐతే సినిమాల్లో బచ్చన్ ఫెయిలైనప్పటికీ.. బిజినెస్ మ్యాన్ గా మాత్రం ఒక గొప్ప విజయం సాధించాడు.
ప్రస్తుతం భారత క్రీడా ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ప్రొ కబడ్డీ లీగ్ కు శ్రీకారం చుట్టింది అభిషేక్ బచ్చనే అన్న సంగతి చాలామందికి తెలియదు. మూడేళ్ల కిందటే అభిషేకే ఈ లీగ్ ను తెరమీదికి తెచ్చాడు. అప్పటికి కబడ్డీకి ఇంత ఆదరణ ఉంటుందని ఎవ్వరికీ అంచనాల్లేవు. క్రికెట్ మినహా మరే క్రీడకూ ఇండియాలో ఆదరణ ఉండదన్న గట్టి నమ్మకంతో ఉన్నారు జనాలు. ఐపీఎల్ తరహాలోనే హాకీ.. ఫుట్ బాల్.. టెన్నిస్ లీగ్స్ వచ్చాయి కానీ.. అవేవీ కూడా క్రికెట్ లీగ్ మాదిరిగా జనాల్ని ఆకర్షించలేదు.
కానీ కబడ్డీ లీగ్ మాత్రం అనూహ్యంగా హిట్టయింది. తొలి సీజన్లో ఓ మాదిరిగా ఆదరణ లభించగా.. రెండో ఏడాది ప్రొ కబడ్డీకి జనాలు బ్రహ్మరథం పట్టారు. కబడ్డీ అభిమానుల్నే కాక కొత్త ప్రేక్షకుల్ని కూడా ఈ లీగ్ ఆకర్షించింది. దీంతో ఒక్కసారిగా లీగ్ వాల్యూ పెరిగిపోయింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే రెండో లీగ్ కూడా నిర్వహించారు. అది కూడా సూపర్ హిట్టయింది. ఈ లీగ్ వ్యవస్థాపకుల్లో ఒకడైన జూనియర్ బచ్చన్.. జైపూర్ పింక్ పాంథర్స్ టీంకు యజమాని కూడా. మొత్తానికి లీగ్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు బచ్చన్ బాబు. సినిమాల్లో ఫెయిలైనా బిజినెస్ మ్యాన్ గా మాత్రం బాగానే సక్సెస్ అయ్యాడు అభిషేక్.