Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డు మూవీని రీమేక్‌ చేస్తున్న జూ. బచ్చన్‌

By:  Tupaki Desk   |   19 Aug 2021 7:00 PM IST
జాతీయ అవార్డు మూవీని రీమేక్‌ చేస్తున్న జూ. బచ్చన్‌
X
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ తనయుడు అభిషేక్ బచ్చన్‌ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలను చేస్తున్నాడు. కమర్షియల్‌ సినిమాలు చేస్తే ఫలితం దక్కక పోవడంతో కాస్త విభిన్నంగా.. నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టే సినిమాలను బచ్చన్ చేస్తున్నాడు. ఈమద్య కాలంలో సౌత్‌ లో వచ్చిన చాలా సినిమాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. ఆ సినిమా లు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. జాతీయ అవార్డు దక్కించుకున్న తమిళ సినిమాను ఇప్పుడు అభిషేక్ బచ్చన్ రీమేక్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు.

తమిళంలో రూపొంది రెండు విభాగాల్లో జాతీయ అవార్డును దక్కించుకున్న ఒత్తా సెరుప్పు సినిమా ను అమితాబచ్చన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్థిబన్ దర్శకత్వంలో ఒత్తా సెరుప్పు సినిమా తెరకెక్కింది. సినిమా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 2019 లో విడుదల అయిన ఈ సినిమా ను ఇప్పుడు అమితాబచ్చన్‌ రీమేక్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు.

హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న అమితాబచ్చన్‌ తండ్రి రేంజ్ స్టార్‌ డమ్‌ ను మాత్రం దక్కించుకోలేక పోతున్నాడు. ఆయన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈమద్య కాలంలో ఈయన వరుసగా ఓటీటీ సినిమాలు.. వెబ్‌ సిరీస్ లు చేస్తున్నాడు. ఈ రీమేక్ ను కూడా ఓటీటీ లోనే విడుదల చేస్తాడా లేదంటే థియేటర్‌ రిలీజ్ కు ఇస్తాడా అనేది చూడాలి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రీమేక్ ఫస్ట్‌ లుక్ ను అతి త్వరలోనే జూనియర్ బచ్చన్‌ అభిషేక్ బచ్చన్‌ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సౌత్‌ సినిమాల టైమ్‌ ప్రస్తుతం అక్కడ నడుస్తోంది. కనుక ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ సక్సెస్ అవుతుందేమో చూడాలి.