Begin typing your search above and press return to search.

అశిన్‌ చుట్టూ 'మహిళా మండలి'

By:  Tupaki Desk   |   25 July 2015 11:58 AM IST
అశిన్‌ చుట్టూ  మహిళా మండలి
X
సౌత్‌ నుంచి బాలీవుడ్‌ వెళ్లి స్థిరంగా అవకాశాలు అందుకుంటున్న ఏకైక కథానాయిక అశిన్‌. పదేళ్లు గా ఈ బ్యూటీ ఉత్తరాదిన కెరీర్‌ సాగిస్తోంది. పరాజయాల వల్ల అవకాశాలు కాస్త నెమ్మదించినా తెలివిగా బండి నెట్టుకొస్తోంది. ప్రస్తుతం ఆల్‌ ఈజ్‌ వెల్‌ సీక్వెల్‌ లో నటిస్తోంది. ఆన్‌ సెట్స్‌ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. అభిషేక్‌ బచ్చన్‌, అసిన్‌ సహా కీలక నటీనటులపై చిత్రీకరణ సాగుతోంది.

అయితే ఆన్‌ సెట్స్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ చాలా కామెడీలు చేస్తున్నాడు. ముఖ్యంగా అశిన్‌ ని ఆటపట్టించడానికి తెగ వెంటపడుతున్నాడు. అంతేనా ఈ ఆటలో అశిన్‌ వ్యక్తిగత స్టాఫ్‌ ని కూడా భాగం చేసేశాడు. పైగా వాళ్లకు 'మహిళా మండలి' అంటూ ఓ టైటిల్‌ కూడా పెట్టేశాడు. ఇదంతా చూస్తుంటే మనోడు ఫన్‌ తో అందరినీ కట్టిపడేస్తున్నాడని అర్థమవుతోంది. అమితాబ్‌ బచ్చన్‌ నట వారసుడిగా యాంగ్రీ యంగ్‌ మెన్‌ గా స్టార్‌ స్టడ్డుడ్‌ సినిమాలు చేస్తాడని అనుకున్నారంతా. కానీ ఎందుకో అభిషేక్‌ కి ఆశించినంత గుర్తింపు, పేరు రాలేదు.

పైగా ఇటీవలి కాలంలో అన్నీ కామెడీ వేషాలు వేస్తున్నాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో సహాయక పాత్రలతో సరిపుచ్చుకుంటున్నాడు. నటనలో ఎదగలేకపోయినందుకు కనీసం ఏ ప్రొడక్షన్‌ ప్లాన్స్‌ అయినా చేసుకోలేకపోయాడు. ఇప్పుడిలా మహిళల వెంట పడి మహిళా మండలి అంటూ కామెడీలు చేస్తూ కాలం గడిపేయడం హాస్యాస్పదం. ఐష్‌ ని చూసైనా నేర్చుకోలేదింకా. టూ బ్యాడ్‌ అభి!