Begin typing your search above and press return to search.
జూనియర్ మెగాస్టార్.. 17 ఏళ్ళయ్యింది
By: Tupaki Desk | 1 July 2017 1:51 PM ISTరాజస్తాన్ పరిసర ప్రాంతంలో ఒక షూటింగ్ జరుగుతుంది. అక్కడకు దగ్గరలో ఉన్న ఊరి జనాలు ఆ షూటింగ్ చూడటానికి బయలుదేరి వెళుతున్నారు షూటింగ్ చూడటానికి కాదు. ఏదో సినిమా ఒకటి షూట్ చేస్తున్నారటా ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ కొడుకు హీరోగా నటిస్తున్నాడటా అందుకని జనాలు వాళ్ళ అభిమాన మెగా స్టార్ కొడుకు ఎలా ఉన్నాడో ఎలా చేస్తాడో అని వచ్చి చూశారు. ఆ సినిమానే ‘రెఫ్యూజి’. జె. పి.దత్త డైరక్షన్ చేసిన ఈ సినిమాతోనే అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.
ఈ సినిమా వచ్చి 17 ఏళ్ళు నిండిన సందర్భంగా అబిషేక్ బచ్చన్ తన ఫేస్ బుక్ పేజ్ లో డైరెక్టర్ జె. పి. దత్త్ తో దిగిన మొదటి ఫోటో ని పోస్ట్ చేశాడు. రెండు ఏళ్ళు కిందట ఇదే సినిమాకు 15 ఏళ్ళు నిండినప్పుడు మన జూనియర్ బచ్చన్ తన మొదటి కొ స్టార్ కరీనా కపూర్ ఖాన్ ను తెగ పోగిడేసాడు. “నా మొదటి హీరోయిన్ నాకు ఎప్పుడూ స్పెషలే.. నా మొదటి సినిమా ఫ్రెండ్ కరీనా ఎప్పటికీ తన అభిమాన కొ-స్టార్'' అని కితాబు ఇచ్చాడు. ఆ సినిమా తరువాత డైరెక్టర్ జె పి దత్తా తో మళ్ళీ అభిషేక్ నటించలేదు. 17 ఏళ్ళు తరువాత ‘పల్తాన్’ అనే సినిమాలో జె పి దత్త్ డైరక్షన్లో మళ్ళీ నటించబోతున్నాడు అభిషేక్. ఈ సినిమా వివరాలు పూర్తిగా ఇంకా విడుదల కాలేదు.
రెఫూజీ సినిమాతో మొదలపెట్టిన అభిషేక్ నట ప్రయాణం చాల మలుపులు విమర్శలుతో సాగింది. తండ్రి స్థాయిని అందుకోలేకపోతున్నాడు అని కొందరు ఘాటుగానే విమర్శించారు. కానీ ఫోకస్ అంతా తన సొంత నటన పై పెట్టి ‘ధూమ్’, ‘గురు’, దిల్లీ 6 లాంటి సినిమాలు తో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు ఈ జూనియర్ మెగాస్టార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/