Begin typing your search above and press return to search.

చెన్నై జోరువానలో బచ్చన్ పెద్ద సాహనం

By:  Tupaki Desk   |   4 Dec 2015 1:50 PM IST
చెన్నై జోరువానలో బచ్చన్  పెద్ద సాహనం
X
బాలీవుడ్ నటుడు.. బిగ్ బి అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ తాజాగా భారీ సాహసాన్నే చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ జట్టుతో చెన్నైకి చేరుకున్న ఆయన.. భారీ వర్షాల కారణంగా చెన్నైలో చిక్కుకుపోయారు. జట్టుతో పాటు చెన్నైలో చిక్కుకుపోయిన ఆయన.. ముంబయి చేరుకోవటానికి సినీ ఫక్కీలో సాహసం చేశారు. ఓవైపు జోరున కురుస్తున్న వాన.. రహదారి సరిగా లేకున్నా.. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయినా లైట్ తీసుకున్న ఆయన పెద్ద రిస్కే తీసుకున్నారు.

తాను.. తన జట్టు ముంబయి చేరుకోవాలన్న లక్ష్యంతో ఆయన సినిమా ఫక్కీలో పెద్ద యాత్రనే చేశారు. చెన్నైకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంటకు చేరుకుంటే.. ముంబయికి ఇట్టే వెళ్లిపోవచ్చన్న ఆలోచనతో ఆయన జోరు వానను పట్టించుకోకుండా చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు.

అలా బయలుదేరిన వారి జర్నీ ఏ మాత్రం బాగా సాగలేదు. జోరున కురిసే వర్షంలో.. ఎక్కడికక్కడ ఆగిన వాహనాల మధ్య వీలు చేసుకుంటూ.. మధ్య మధ్యలో వర్షపు అవాంతరాల్ని ఎదుర్కొంటూ కష్టపడి చెన్నై నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి విమానంలో ముంబయికి వెళ్లిపోయారు. రేణిగుంటకు చేరుకున్న అభిషేక్ ను అక్కడి వారి గుర్తించి చుట్టుముట్టేశారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ చేరేందుకు జోరు వర్షంలో బయలుదేరిన అభిషేక్ భారీ సాహసమే చేశారనే చెప్పాలి.