Begin typing your search above and press return to search.

టీజర్ టాక్‌: దీన్ని ఏం టీజర్‌ అనాలే??

By:  Tupaki Desk   |   3 Jun 2016 1:12 PM GMT
టీజర్ టాక్‌: దీన్ని ఏం టీజర్‌ అనాలే??
X
ఈరోజు సాయంత్రం ''అభినేత్రి'' సినిమా టీజర్‌ వస్తోంది అన్నారు కోన సార్‌. డ్యాన్స మాష్టర్‌ ప్రభుదేవా.. దర్శకులు ఎ.ఎల్‌.విజయ్‌.. లతో కలసి ఆయన తమన్నా లీడ్‌ రోల్‌ లో ఈ సినిమాను తీస్తున్నారులే. పైగా చంద్రముఖి రేంజు బిల్డప్ లు ఇవ్వడంతో.. అందరూ తమన్నా కోసం ఎదురు చూపులు చూశారు.

చివరకు రిలీజైన టీజర్‌ మాత్రం.. బాగా షాకిచ్చింది. కేవలం ప్రభుదేవ డ్యాన్సుతో ఈ టీజర్‌ ను నింపేశారు అంతే. సినిమాలో ఒక పాటలో ప్రభు సరసన ఆమీ జాక్సన్ కూడా ఉందనే విషయాన్ని రివీల్‌ చేశారు. ఓహ్ చెప్పడం మర్చిపోయాం.. ఇప్పటివరకు అనేకసార్లు మనం చూసిన ఆ రొటీన్‌ డ్యాన్సులను ప్రభుదేవా మళ్ళీ మళ్ళీ చేసి చూపించాడు. పైగా గ్రాఫిక్స్ కూడా వాడారు ఒక ఫ్లోర్ మూమెంట్‌ కోసం. అభినేత్రి టీజర్‌ అని చెప్పి.. ఈ డ్యాన్స్ బిట్‌ చూపిస్తుంటే.. అసలు ఏమని అనాలో కూడా ఎవ్వరికీ అర్దం కావట్లేదు. ఇక టీజర్‌ టాక్‌ మాత్రం ఏం చెప్తారులే.

ఇక ఈ టీజర్‌ లాంచ్‌ కోసం.. తాను ఈ సినిమాలో పోషిస్తున్న పనమ్మాయ్‌ పాత్రలో విచ్చేసిన తమన్నా మాత్రం అందరికీ ఒకింత షాకిచ్చేసింది.