Begin typing your search above and press return to search.

త‌మ‌న్నా రెండో లుక్ పిచ్చెక్కించేస్తోందిగా..

By:  Tupaki Desk   |   5 July 2016 4:30 PM GMT
త‌మ‌న్నా రెండో లుక్ పిచ్చెక్కించేస్తోందిగా..
X
‘అభినేత్రి’ సినిమా కోసం త‌మ‌న్నా ఎత్తిన కొత్త అవ‌తారం చూసి ఆ మ‌ధ్య జ‌నాలు జ‌డుసుకున్నారు. వ‌య‌సు మ‌ళ్లిన పాత‌కాలం ప‌ల్లెటూరి అమ్మాయిలాగా కాట‌న్ చీర‌.. త‌ల్లో మ‌ల్లెపూలు.. నుదుటన పెద్ద బొట్టుతో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన లుక్ అంద‌రికీ షాకిచ్చింది త‌మ్మూ. ఐతే అభినేత్రి సినిమాలో మిల్కీ బ్యూటీ ఈ ఒక్క లుక్కుతోనే క‌నిపిస్తే కుర్రాళ్ల‌ను థియేట‌రుకి ర‌ప్పించ‌డం చాలా క‌ష్ట‌మే.

ఐతే త‌మ్మూ ఫ్యాన్స్ మ‌రీ కంగారు ప‌డిపోవాల్సిన ప‌ని లేదు. ఈ సినిమాలో త‌మ్మూ గ్లామ‌ర్ లుక్ కూడా ఉంది. ఆ లుక్ ఈ రోజే బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌ధ్య‌లో ప్ర‌భుదేవా.. ఓవైపు ఇంత‌కుముందు చూసిన పాత లుక్.. మ‌రోవైపు హాట్ లుక్ తో త‌మ్మూ.. ఇలా కొత్త పోస్ట‌ర్ డిజైన్ చేశారు. మొత్తానికి తమ్మూ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తోంద‌ని.. ఓ క్యారెక్ట‌ర్ కుర్రాళ్ల‌ను బాగానే క‌వ్విస్తుంద‌ని అర్థ‌మైంది.

ప్రభుదేవా., త‌మ‌న్నా.. సోనూసూద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ హార్రర్ కామెడీ మూవీకి ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. తెలుగు.. త‌మిళ‌.. హిందీ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌భుదేవానే స్వ‌యంగా నిర్మిస్తున్నాడు. తెలుగులో ‘అభినేత్రి’ని కోన వెంక‌ట్ విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ‌వ్వ‌గా.. ఆగ‌స్టు 15న శ్రీదేవి ముఖ్య అతిథిగా విజ‌య‌వాడ‌లో పెద్ద ఎత్తున ఆడియో వేడుక చేయ‌బోతున్నారు. సెప్టెంబ‌రులో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.