Begin typing your search above and press return to search.
బిబి4 విజేత మిస్టర్ కూల్ అభిజిత్
By: Tupaki Desk | 21 Dec 2020 8:30 AM ISTఊహించినట్లుగానే బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అభిజిత్ నిలిచాడు. మిస్టర్ కూల్ గా మిస్టర్ పెర్ఫెక్ట్ గా మొదటి నుండి నిలకడగా ఆడుతూ వస్తుండటంతో పాటు ఆయనకు బయట ఉన్న పీఆర్ టీం చేసిన పబ్లిసిటీ సోషల్ మీడియా ప్రమోషన్ తో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యాడు. ఆదివారం అయిదు గంటల పాటు సాగిన ఫినాలే ఎపిసోడ్ లో మొదట హారిక ఎలిమినేట్ అవ్వగా ఆతర్వాత అరియానా ఎలిమినేట్ అయ్యింది. చివరకు ముగ్గురు అఖిల్, అభిజిత్, సోహెల్ లు మిగిలారు. వీరు ముగ్గురికి నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీలో సగం అయిన రూ.25 లక్షలు తీసుకుని మీలో ఎవరైనా బయటకు రావాలంటే వచ్చేయవచ్చు అంటూ ప్రపోజల్ పెట్టాడు.
నాగార్జున ఇచ్చిన ప్రపోజల్ కు సోహెల్ చాలా తెలివిగా నిర్ణయం తీసుకుని ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చేశాడు. విమర్శలు రాకూడదనే ఉద్దేశ్యంతో రూ.10 లక్షల రూపాయలను ఆనాధ ఆశ్రమానికి ఇస్తానంటూ చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ అయిదు లక్షలు మాత్రమే అనాధ ఆశ్రమంకు ఇస్తాను.. మిగిలిన అయిదు లక్షల రూపాయలు మెహబూబ్ కు ఇస్తాను అన్నాడు. మెహబూబ్ కూడా తనకు సోహెల్ ఇస్తానన్న రూ.5 లక్షలను అనాధ ఆశ్రమంకు ఇస్తానంటూ చెప్పాడు. వారిద్దరి మంచి మనసులు చూసి ఆ పాతిక లక్షలు మీరే ఉంచేసుకోండి నేను 10 లక్షలు ఆ అనాధ ఆశ్రమంకు ఇస్తాను అంటూ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత చిరంజీవి వచ్చి సోహెల్ నువ్వు మెహబూబ్ కు ఇవ్వనక్కర్లేదు. నేను రూ.10 లక్షలు మెహబూబ్ కు ఇస్తాను అంటూ అక్కడే చెక్ రాసి మెహబూబ్ చేతుల్లో చిరంజీవి పెట్టారు. దాంతో సోహెల్ కు 25 లక్షలు దక్కాయి.
ఇక అభిజిత్ మరియు అఖిల్ లు ఉండగా ఇద్దరిలో విజేత ఎవరు.. మిగిలి ఉన్న ఆ రూ.25 లక్షలను దక్కించుకునేది ఎవరు అనేది తేల్చి పారేద్దాం అంటూ నాగార్జున ఇద్దరు చేతులు ఎత్తి పట్టుకుని అఖిల్ చేయి కిందకు దించి అభిజిత్ ను విన్నర్ గా ప్రకటించాడు. అభిజిత్ కు చిరంజీవి చేతుల మీదుగా బిబి4 ట్రోఫీ ఇప్పించారు. అఖిల్ మరియు అభిజిత్ లపై ప్రశంసలు కురిపిస్తూ చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ గా అభిజిత్ నిలిస్తే అంతకు మించి అన్నట్లుగా సోహెల్ కూడా విన్నర్ గా నిలిచాడు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే సోహెల్ కు మటన్ ఇష్టం అని చిరంజీవి గారి భార్య సురేష్ మటన్ బిర్యానీ చేసి పంపించారు. అది చిరంజీవి సోహెల్ కు అందించాడు. అలాగే సోహెల్ సినిమా చేస్తే అందులో చిన్న పాత్ర చేయడంతో పాటు చిరంజీవి మరియు నాగార్జునలు ఇద్దరు కూడా ప్రీ రిలీజ్ వేడుక లేదా మరేదైనా వేడుకలో హాజరై సినిమా ప్రమోషన్ కు హెల్ప్ చేస్తామంటూ హామీ ఇచ్చారు.