Begin typing your search above and press return to search.

చెప్పుకోండి చూద్దాం.. ఈ పాల‌బుగ్గ‌ల బుల్లోడెవ‌రు?

By:  Tupaki Desk   |   22 Jan 2021 11:14 AM GMT
చెప్పుకోండి చూద్దాం.. ఈ పాల‌బుగ్గ‌ల బుల్లోడెవ‌రు?
X
పై ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అమ్మ చేతుల్లో అమాయ‌కంగా క‌నిపిస్తున్న ఈ పాల‌బుగ్గ‌ల పిల్లోడు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిన కుర్రోడు! ఈ క్యూట్ బాయ్ మరెవరో కాదు.. బిగ్ బాస్-4 సీజన్లో విజేతగా నిలిచిన అభిజీత్.

సాఫ్ట్ లవర్ బాయ్ గా అందరినీ ఆకట్టుకునే అభిజీత్.. చిన్నప్పుడు కూడా భలే స్వీట్ గా ఉన్నాడు కదూ..! ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు అభిజీత్‌. దీంతో.. ఆయ‌న అభిమానులు తెగ స‌ర్క్యులేట్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన అభి.. ఈ ఫొటోకు 'అమ్మ ప్రేమ' అనే క్యాప్షన్ యాడ్ చేశాడు.

కేవలం ఎక్స్‌పీరియన్స్‌ కోసమే తాను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాన‌న్న అభిజీత్‌.. ఆ త‌ర్వాత క్లిష్ట‌మైన టాస్కుల‌ను కూడా స‌క్సెస్ ఫుల్ గా క్లోజ్ చేశాడు. త‌న మైండ్‌ గేమ్ తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అభి.. బిగ్ బాస్ హౌస్ మ‌హానాయ‌కుడు అయ్యాడు.

హౌస్ లోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా ఏదో విధంగా ఫ్యాన్స్ తో ట‌చ్ లో ఉంటున్నాడు అభిజీత్‌. లేటెస్ట్ గా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో.. నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ‘భ‌లే క్యూట్ గా ఉన్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.