Begin typing your search above and press return to search.

జ‌న‌తా గ్యారేజ్‌ లో అభ‌య్ హంగామా

By:  Tupaki Desk   |   9 May 2016 1:36 PM GMT
జ‌న‌తా గ్యారేజ్‌ లో అభ‌య్ హంగామా
X
స్టార్ట్ కెమెరా యాక్ష‌న్ అని ద‌ర్శ‌కుడు చెప్ప‌గానే అక్క‌డంద‌రూ ఎన్టీఆర్ కెమెరా ముందుకొస్తాడ‌ని ఊహించారు. కానీ ఆయ‌న ముద్దుల త‌న‌యుడు అభ‌య్‌ రామ్ బుడి బుడి అడుగులు వేస్తూ వ‌చ్చాడు. దీంతో సెట్లో అంద‌రిక‌ళ్లూ అభ‌య్‌ రామ్‌ పైకి మ‌ళ్లాయి. ద‌ర్శ‌కుడు సైతం మెగాఫోన్ వ‌దిలిపెట్టి అభ‌య్‌ రాముడి సంద‌డిని చూసేందుక‌ని లేచి నిలుచున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ సెట్లో చోటు చేసుకొందీ దృశ్యం.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో వేసిన ఓ సెట్‌ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఆ సెట్‌ కి సోమ‌వారం ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్‌ రామ్ వ‌చ్చాడు. ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీప్ర‌ణ‌తి త‌న త‌న‌యుడిని వెంట తీసుకొని సెట్‌ కి వ‌చ్చారు. దీంతో సెట్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. అభ‌య్ చాలాసేపు సెట్ లో ప్రాప‌ర్టీల్ని ప‌ట్టుకొని, వాటిని త‌దేకంగా ప‌రిశీలిస్తూ సంద‌డి చేశాడ‌ట‌.

అభ‌య్‌ రామ్ జ‌న‌తా గ్యారేజ్ సెట్‌ కి రావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఎన్టీఆర్ త‌న త‌న‌యుడితో క‌లిసి దిగిన ఫొటోల్ని ఆన్‌ లైన్లో పెట్టారు. జ‌న‌తా గ్యారేజ్ సినిమా అభ‌య్‌ రామ్‌ కి ఓ తీపి జ్ఞాప‌కంగా మార‌బోతోంది. ఈ సినిమా ప్రారంభానికి కూడా అభ‌య్‌ రామ్ హాజ‌ర‌య్యాడు. ఇప్పుడు సెట్‌ కి కూడా వ‌చ్చాడు. భ‌విష్య‌త్తులో ఓ తీపిజ్ఞాప‌కంలా చెప్పుకోవ‌డానికి వుంటుంద‌న్న‌మాట‌.