Begin typing your search above and press return to search.

బుల్లి యంగ్ టైగర్ భలే ఉన్నాడే

By:  Tupaki Desk   |   22 April 2018 8:49 AM GMT
బుల్లి యంగ్ టైగర్ భలే ఉన్నాడే
X
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు కానీ అమ్మతో కలిసి అప్పుడప్పుడు బయటికి వచ్చే వారసుడు అభయ్ రాం మాత్రం ఎక్కడున్నా అందరికి చూపు తనవైపు తిప్పుకునేలా చేసుకుంటాడు. ఇటీవలే ఒక ఫంక్షన్ కోసం వచ్చిన అభయ్ రామ్ అక్కడ స్పైడర్ మ్యాన్ ట్యాటూ చేతికి వేయించుకుంటూ కెమెరా కంటికి చిక్కాడు. అమాయకమైన మొహం పెట్టి ఏదో కావాలని కోరుతున్నట్టుగా చూస్తున్న అభయ్ రామ్ ని ఈ ఫోటోలో చూసి ఫాన్స్ తెగ మురిసిపోతున్నారు. అచ్చం నాన్న లాగే ఉన్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అవేవి అర్థం చేసుకోలేని వయసు కాబట్టి అభయ్ రామ్ అంత అమాయకంగా ఫేస్ పెట్టాడు అనుకోవచ్చు.

ఇప్పుడు అభయ్ రామ్ వయసు నాలుగేళ్ళు. జూలై 22న ఐదో ఏడులోకి అడుగు పెడతాడు. ఓ మూడు నాలుగేళ్ల తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా అభయ్ ని తీసుకొచ్చే ప్రయత్నం తారక్ ఏమైనా చేస్తాడేమో చూడాలి. మహేష్ గౌతంని 1 నేనొక్కడినేలో సాంపిల్ చూపించాడు. చరణ్ ఇంకా తండ్రి కాలేదు. ప్రభాస్ పెళ్లి ఆలోచన చెయ్యట్లేదు. అల్లు అర్జున్ తండ్రి అయిన ఆనందాన్ని రెండు సార్లు అనుభవించి జోష్ లో ఉన్నాడు. ఇలా తన సమకాలీకులు అందరు ఫ్యామిలీ లైఫ్ ని చేస్తుండగా తారక్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడన్న వార్త రెండు నెలల క్రితమే వైరల్ అయ్యింది. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్న జూనియర్ అది పూర్తి కాగానే రాజమౌళి మల్టీ స్టారర్ కోసం జాయిన్ అవుతాడు.