Begin typing your search above and press return to search.

అభయ్‌ రామ్‌ ఉన్నాడంటున్నారు.. నిజమేనా?

By:  Tupaki Desk   |   6 Oct 2018 11:57 AM GMT
అభయ్‌ రామ్‌ ఉన్నాడంటున్నారు.. నిజమేనా?
X
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరో అయిదు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడో రేపో ఈ చిత్రం సెన్సార్‌ బోర్డు ముందుకు కూడా వెళ్లబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ వంద కోట్ల క్లబ్‌ లో మొదటి సారి చేరబోతున్నాడు అనే నమ్మకంను నందమూరి ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అంచనాలున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌ కనిపించబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్‌ చిన్నప్పటి పాత్రలో అభయ్‌ రామ్‌ ను కొన్ని నిమిషాల పాటు చూపించబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ఎవరికి వారే ఊహించుకుంటున్నారు. అభయ్‌ రామ్‌ ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌ స్పాట్‌ కు పలు సార్లు వచ్చినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. దానికి తోడు తాజాగా విడుదలైన మేకింగ్‌ వీడియోలో కూడా అభయ్‌ కనిపించాడు. అందుకే ఈ సినిమాలో అభయ్‌ ఉంటాడనే నమ్మకంను ఫ్యాన్స్‌ పెంచుకుంటున్నారు.

నందమూరి ఫ్యాన్స్‌ ఆశపడుతున్నట్లుగా - ఆలోచిస్తున్నట్లుగా ఈ సినిమాలో అభయ్‌ రామ్‌ ఉండడని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జనతా గ్యారేజ్‌ సెట్స్‌ లో కూడా అభయ్‌ సందడి చేశాడు. ఎన్టీఆర్‌ తో కొన్ని సార్లు సరదాగా అభయ్‌ సెట్స్‌ కు వచ్చేవాడేమో తప్ప సినిమాలో కనిపించే అవకాశం లేదు అంటూ కొందరు నమ్మకంగా చెబుతున్నారు. మరి నిజం ఏంటీ అనేది ఈ నెల 11న సినిమా విడుదలైతే తేలిపోనుంది. ఎన్టీఆర్‌ చిన్నప్పటి పాత్రతో అభిరామ్‌ ఎంట్రీ ఇస్తే సినిమా స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాని త్రివిక్రమ్‌ ఇలా అభిరామ్‌ ను వినియోగించుకుని సినిమా స్థాయిని పెంచుకునే రకం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.