Begin typing your search above and press return to search.

మిస్సైల్ మ్యాన్ బయోపిక్.. వాటే టైమింగ్

By:  Tupaki Desk   |   16 Feb 2017 4:22 AM GMT
మిస్సైల్ మ్యాన్ బయోపిక్.. వాటే టైమింగ్
X
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించిన డా. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఎంతో ఆదర్శప్రాయం. భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త.. ఇప్పుడు మన మధ్య లేకపోయినా.. భారతీయులపై ఖగోళంలో తన ముద్ర వేసి భద్రపరిచారు. అలాంటి మహానుభావుడిపై బయోపిక్ తీస్తామని గతంలోనే నిర్మాత అనిల్ సుంకర ప్రకటించినా.. ఇప్పుడు ఆ మూవీ గురించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ లెజెండరీ సైంటిస్ట్ జీవితంపై భారీ బడ్జెట్ తో నిర్మాత అనిల్ సుంకర ఓ మూవీ చేయనున్నారు. అభిషేక్ అగర్వాల్ తో కలిసి నిర్మించనున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. 'ప్రతీ వయసులోనూ ఏ హీరో ఉంటాడు.. ప్రతీ హీరోకి ఓ కథ ఉంటుంది' అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ తో ఈ ఫస్ట్ లుక్ అకట్టుకుంది. అయితే.. ఇది పెయింటెడ్ పోస్టర్ మాత్రమే అయినా.. దీన్ని అనౌన్స్ చేసిన టైమింగ్ కారణంగా వైరల్ అయిపోయింది.

ఇవాళే ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ ఎల్‌ వీ-సీ37 ద్వారా.. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి దిగ్విజయంగా పంపారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని.. మిస్సైల్ మ్యాన్ కు నివాళిగా ఈ చిత్రం లుక్ రిలీజ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రాజ్ చెంగప్ప.. అబ్దుల కలాం జీవిత గాధను కథా రూపంలోకి మార్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/