Begin typing your search above and press return to search.

సామ్ కు జిరాక్స్.. మతి పోగొట్టేస్తుందిగా?

By:  Tupaki Desk   |   12 Feb 2020 12:00 AM IST
సామ్ కు జిరాక్స్.. మతి పోగొట్టేస్తుందిగా?
X
మనిషిని పోలిన మనుషులు ఏడు మంది ఈ ప్రపంచంలో ఉంటారని చెబుతారు. అయితే.. అలా కనిపించేటోళ్లు కొందరుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. కాకుంటే.. మరీ.. ఇంత దగ్గరి పోలికలతో ఇప్పటివరకూ ఏ టాప్ హీరోయిన్ కు జిరాక్స్ కాపీ లేదనే చెప్పాలి. ఐశ్వర్యారాయ్ ను పోలినట్లుగా ఉంటుందని స్నేహఉల్లాల్ ను చెప్పినా.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపించేది.

అందుకు భిన్నంగా తాజాగా సమంతకు డిటో అన్నట్లుగా ఉన్న నటి ఒకరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. సామ్ కు జిరాక్స్ కాపీలా ఉన్న ఈ హాట్ భామ పేరు ఆత్మిక. సమంత పోలికలకు దగ్గరగా ఉండటం.. దీంతో ఆమె మాదిరే కాసిన్ని మార్పులు చేసుకోవటంతో చాలా యాంగిల్స్ లో ఆమె ఫోటోల్ని చూస్తే.. అచ్చు సమమంతను చూసిన ఫీలింగే కలుగక మానదు. అంతేనా.. సమంత ఫోటోలనే చూపిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నామన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేసే ప్రమాదం లేక పోలేదు.

నిజంగానే ఆత్మిక మన సామ్ మాదిరే ఉంటుందా? అంటే.. అవునని చెప్పాలి. అయితే.. కొన్ని యాంగిల్స్ లోనే. తనకు.. సమంతకు పోలికలు కొట్టొచ్చేలా ఉండేలా ఫోటో షూట్ చేయటంతో మరింత హాట్ టాపిక్ గా మారుతోందీ భామ. చిట్టి.. పొట్టి దుస్తులతో అందరి కంట్లో పడేలా చేస్తోంది.

ఇప్పటికే మీసాయ మురుక్కు.. కాట్టేరి చిత్రాల్లో నటించిన ఈ భామకు.. మన సమంత కు మధ్యనున్న తేడా కొట్టొచ్చినట్లు కనిపించేది చేతి వేళ్ల దగ్గరే. సమంత వేళ్లు సన్నగా ఉంటే..ఆత్మిక వేళ్లు అందుకు భిన్నంగా ఉంటాయి అంతేకాదు.. పల్చగా నవ్వినప్పుడు పెదాల దగ్గర తేడా కనిపిస్తుంది. సామ్ పెదాల్లో ఉండే మేజిక్.. అత్మికలో మిస్ అవుతుంది. ఇలా చిన్న తేడాలు తప్పిస్తే.. మొత్తంగా చూస్తే మాత్రం సమంతకు జిరాక్స్ కాపీలా ఉంటుందని చెప్పక తప్పదు. సమంతలా కనిపిస్తున్న అత్మిక మీడియాలో పాపులర్ అవుతోంది. తెలుగు నిర్మాతల కంట్లో పడితే మాత్రం ఆఫర్లు ఎక్కువగానే వచ్చే వీలుందంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.