Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: వేటకు రెడీగా ఆటగాళ్లు

By:  Tupaki Desk   |   11 May 2018 9:39 PM IST
ఫస్ట్ లుక్: వేటకు రెడీగా ఆటగాళ్లు
X
ట్యాలెంటెడ్ యాక్టర్లు ఒక చోటకు చేరితే ఎలా ఉంటుందో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క లుక్ చూస్తే అర్ధమయిపోతుంది. ఆటగాళ్లు అంటూ జగపతి బాబు.. నారా రోహిత్ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇప్పుడీ చిత్రానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు.

జీవితం కోసం ఆట ఆడే వ్యక్తులుగా ఈ ఇద్దరు కనిపించబోతున్నారన్నది.. ఆటగాళ్లు ట్యాగ్ లైన్ కి అర్ధం. అయినా ఈ చిత్రం గురించి చెప్పేందుకు.. ఎన్నో మాటలు అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లుక్ ను అంత ఇంటెన్స్ గా క్రియేట్ చేసి విడుదల చేశారు. జగపతి బాబు.. నారా రోహిత్.. ఇద్దరూ చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. ఇద్దరి కళ్లలో కనిపిస్తున్న కసి.. గెలుపు కోసం వీరు ఎంతదూరం వెళతారో చెప్పకనే చెబుతుంది. స్టైలిష్ మేకోవర్ జగపతి బాబుకు బాగా అలవాటు అయిపోయింది. థీమ్ బేస్డ్ సినిమాలను నారా రోహిత్ బాగానే వంటబట్టించేసుకుంటున్నాడు.

జగపతి బాబు- నారా రోహిత్ ల మధ్య నడిచే వార్ నేపథ్యంలోనే ఆటగాళ్లు సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సాయి కార్తీక్ సంగీతం అంచిందిన ఈ చిత్రంలో.. దర్శన బానిక్ హీరోయిన్ గా నటిస్తోంది.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి