Begin typing your search above and press return to search.

ఆటాడుకుందాం అంటే యూ/ఏ ఇచ్చారే

By:  Tupaki Desk   |   12 Aug 2016 4:33 AM GMT
ఆటాడుకుందాం అంటే యూ/ఏ ఇచ్చారే
X
అక్కినేని వంశం నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. 7-8 ఏళ్ల కెరీర్ లో పట్టుమని మూడే సినిమాలు చేసినా.. అన్నీ వేటికవే సెపరేట్ గా వేరియేశన్స్ తో ఆకట్టుకుంటాయి. ఆటాడుకుందాం రా అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పుడీ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నిటినీ పూర్తి చేసుకుంది.

సుశాంత్- సోనమ్ బజ్వా హీరో హీరోయిన్లుగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆటాడుకుందాం రా.. మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అయినా.. అక్కడక్కడా యాక్షన్ ఎలిమెంట్స్ ని.. కాసింత రొమాన్స్ ని మిక్స్ చేయడంతోనే ఇలా యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని తెలుస్తోంది. మూవీలో ఎక్కడా కామెడీ జోరు తగ్గకుండా తీసిన విధానం సూపర్ గా ఉందని టాక్ వినిపిస్తోంది.

ఆగస్ట్ 19న ఆటాడుకుందాం రా మూవీ రిలీజ్ కానుంది. ఈసారి హిట్ కొట్టడంలో ఎలాంటి డౌట్స్ ఉండకూడదనే ఉద్దేశ్యంతో.. అక్కినేని వారసులు ఆటాడుకుందాం రా చిత్రాన్ని ఓ ఫ్యామిలీ ప్యాకేజ్ టైపులో మార్చేశారు. అక్కినేని అఖిల్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుండడం విశేషం. తొలి సినిమా ఆడకపోయినా.. అందులో అఖిల్ డ్యాన్సులకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో అక్కినేని హీరో నాగచైతన్య గెస్ట్ రోల్ కనిపించనుండడం ఆటాడుకుందాం రా స్పెషాలిటీస్ లో మరొకటి.