Begin typing your search above and press return to search.

అషు భల్లే భల్లే డ్యాన్స్.. పండుగ చేసుకుంటున్నారు..!

By:  Tupaki Desk   |   6 Nov 2022 6:02 PM IST
అషు భల్లే భల్లే డ్యాన్స్.. పండుగ చేసుకుంటున్నారు..!
X
ఓ పక్క తన సోషల్ మీడియా ఫోటో షూట్ లో అందాలతో ఎటాక్ చేస్తూ అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న అషు రెడ్డి అది సరిపోలేదు అన్నట్టు ఇన్ స్టా రీల్స్ తో కూడా రచ్చ చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం విదేశాల్లో విహార యాత్ర కొనసాగిస్తున్న అమ్మడు ఛాన్స్ దొరికితే చాలు అయితే ఫోటో షూట్ లేదా ఇన్ స్టా రీల్ తో తన సోషల్ మీడియాని నింపేస్తుంది. అషు చేస్తున్న ఈ గ్లామర్ ఎక్స్ పోజర్ కి ఫాలోవర్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూపించిన ఆమెకి లేనిది మాకెందుకు అంటూ అషు ఫోటోలని.. వీడియోలని విపరీతంగా షేర్ చేస్తున్నారు.

లేటెస్ట్ గానే బెడ్ మీద ఉన్న ఫోటోలతో బాబోయ్ అనిపించేసిన అషు దానితో పాటు లండన్ వీధుల్లో డ్యాన్స్ చేస్తూ హంగామా చేస్తుంది. భల్లే భల్లే సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ తన అందాలతో చూస్తున్న వారి మతులుపోగొడుతుంది అషు రెడ్డి. అషు చేస్తున్న ఈ గ్లామర్ ట్రీట్ చూస్తుంటే అమ్మడు ఏదో పెద్ద స్కెచ్చ్ వేసిందని అనిపిస్తుంది. అందాల ప్రదర్శనలో నో లిమిట్స్ అనేలా ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న అషు రెడ్డి అసలు సీక్రెట్ ఏంటన్నది బయట పెట్టలేదు.

ఉన్నది ఒకటే జిందగి.. దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలన్న లైఫ్ ఫిలాసఫీ ఏదైనా పాటిస్తుందో ఏమో కానీ అమ్మడి ఎంజాయ్ మెంట్ చూసి మిగతా బుల్లితెర భామలంతా కూడా కుళ్లుకుంటున్నారని చెప్పొచ్చు. బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీని రోజు రోజుకి పెంచుకుంటూ వచ్చిన అషు అందల దాడి చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ హుశారు తగ్గించేలా కనిపించట్లేదు. అయితే అషు ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడం వల్ల తన ఫాలోవర్స్ కి మాత్రం ప్రతిరోజు పండుగే అన్నట్టు ఉంది. అంతేకాదు తన గ్లామర్ షో వల్ల సోషల్ మీడియాలో రోజు రోజుకి తన ఫాలోవర్స్ సంఖ్యని పెంచుకుంటూ వస్తుంది అషు బేబీ.

పర్ఫెక్ట్ బాడీ షేపులతో అషు చేస్తున్న హాట్ ఫోటో షూట్, వీడియోలు నిజంగానే యూత్ ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. నేను నా ఆనందం కోసం ఫోటో షూట్ చేస్తున్నా మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే లేదు అని ఆర్జీవి ఫార్ములా తనకి అప్లై చేసుకుంటుంది అషు రెడ్డి.