Begin typing your search above and press return to search.

పూల్ సైడ్ జూనియర్ స‌మంత మంట‌లు

By:  Tupaki Desk   |   14 Oct 2022 9:00 AM IST
పూల్ సైడ్ జూనియర్ స‌మంత మంట‌లు
X
``హాట్ నెస్ మీ కళ్ళలో ఉంది.. నా తొడల్లో కాదు!!`` అంటూ కొటేష‌న్ ఇచ్చిన‌  జూనియ‌ర్ స‌మంత అలియాస్ అషురెడ్డిని తెలుగు ఆడియెన్ మ‌రువ‌లేరు. బిగ్ బాస్ బ్యూటీగా పాపుల‌రైన ప్రముఖ యాంకర్ ఆశు రెడ్డి తనదైన గ్లామర్ తో కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్జీవీతో బోల్డ్ ఇంట‌ర్వ్యూ పేరుతో బోలెడంత హంగామా సృష్టించిన అషురెడ్డి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో హౌస్ మేట్ గా స‌త్తా చాటింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎద‌గాల‌న్న త‌ప‌న‌తో హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ఇటీవ‌ల‌ వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది.

రామ్ గోపాల్ వర్మ డ్యాషింగ్ బోల్డ్ ఇంట‌ర్వ్యూ అషురెడ్డికి ఎంత క‌లిసొచ్చింది? అన్న‌ది అటుంచితే అస‌లు ఆమె ఉంది అన్న‌ది ప్ర‌పంచానికి ఈజీగా తెలిసొచ్చింది ఈ ఇంట‌ర్వ్యూతోనే. ఆ ఇంట‌ర్వ్యూలో ఆర్జీవీ .. అషు తొడల గురించి వ్యాఖ్యానించినప్పుడు ఆమె వీడియోలో అతని ముఖంపై పంచ్ విసిరి వేడెక్కించింది. ఆ త‌ర్వాతా సోషల్ మీడియాలో దూకుడు త‌గ్గ‌లేదు. నిరంత‌ర ఫోటోషూట్ల‌తో ఈ బ్యూటీ ట్రెండింగ్ గా మారింది.

ఆశు రెడ్డి ఇటీవ‌ల‌ స్టార్ మాలో కామెడీ షోలు చేస్తూ అద్భుతమైన పాపులారిటీని సంపాదించుకుంటోంది. ఇటీవ‌ల అషు విదేశీ షికార్లు.. రిచ్ లైఫ్ స్టైల్ గురించి బోలెడంత చ‌ర్చ సాగుతోంది. దుబాయ్ పర్యటన నుంచి తాజాగా ఆషు రెడ్డి హాటెస్ట్ లుక్ ని రివీల్ చేసింది. అషు పూల్ సైడ్ ఫోటోషూట్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. జబర్దస్త్ స్నేహితురాలు నటి రోహిణి చిత్రీకరించిన ఈ ఫోటోల‌లో అషు చాలా హాట్ గా క‌నిపిస్తోంది.

అషు విక్టోరియా సీక్రెట్ రేంజ్ బ్రాండెడ్ లోదుస్తుల‌ను ధ‌రించ‌డంపై యూత్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. దుబాయ్ పామ్ జుమేరాకు ఎదురుగా ఉన్న కొలనులో ఆషు ఇలా ఫోజులిచ్చింది. అన్న‌ట్టు అషు త‌న స్నేహితుల‌తో క‌లిసి మాల్దీవులకు వెళుతుందా?అంటే దానికి ఇంకా ఆన్స‌ర్ రావాల్సి ఉంది.  ఫోటోషూట్లు స‌రే.. సినీకెరీర్ విష‌యంలో ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తోంది? అన్న‌ది వేచి చూడాలి.