Begin typing your search above and press return to search.

న‌టి కం యోగా గాళ్.. హాటెస్ట్ ఠ‌ఫెస్ట్ ఫీట్..

By:  Tupaki Desk   |   26 Jan 2021 7:00 AM IST
న‌టి కం యోగా గాళ్.. హాటెస్ట్ ఠ‌ఫెస్ట్ ఫీట్..
X
ఆస్కా గొరాడియా.. ఇటీవ‌ల బీచ్ యోగా పాఠాల‌తో నిరంతరం అభిమానుల్ని ఆక‌ర్షిస్తున్న పాపుల‌ర్ పేరు ఇది. న‌టి కం యోగా క్వీన్ ఇన్ స్టా ఆద్యంతం ర‌క‌ర‌కాల యోగ భంగిమ‌లు షాక్ కి గురి చేస్తాయి. ముఖ్యంగా త‌న పార్ట‌న‌ర్‌ తో క‌లిసి ఆస్కా ఈ యోగాస‌నాల్ని ప్రాక్టీస్ చేస్తూ ఇన్ స్టాలో షేర్ చేస్తుండ‌డంతో అవి కాస్తా ఇట్టే వైర‌ల్ అయిపోతున్నాయి.

ఆస్కా ప్ర‌ద‌ర్శించే కొన్ని యోగాస‌నాలు టూమచ్ కాంప్లికేటేడ్.. వాటిని కొత్త వాళ్లు అయితే యోగా గురువు స‌మ‌క్షంలో మాత్ర‌మే వేయాలి. వీడియోలు చూసి సాహ‌సిస్తే ఒంట్లో కండ‌రాలు న‌రాలు ప‌ట్టేయ‌డం గ్యారెంటీ.

ప్ర‌స్తుతం గోవా వెకేష‌న్ లో ఉన్న ఆస్కా .. త‌న భాగ‌స్వామితో క‌లిసి అదిరిపోయే విన్యాసానికి తెర తీసింది. బీచ్ ఇసుక‌లో శ‌య‌నించిన‌ అత‌డి కాలి పిక్క బ‌లం ఆధారంగా.. ఆ అరికాలిపై కూచుని అదిరిపోయే విన్యాసం తో అగ్గి రాజేసింది ఆస్కా. ఈ ఫోటోకి పాట‌తో కామెంట్ చేయండి! అంటూ వ్యాఖ్య‌ను జోడించింది.

టిల్ ది డేట్ కాంప్లికేటెడ్ .. ఠ‌ఫెస్ట్ ఫీట్ ఇదే. అయితే ఇలాంటి మ‌రెన్నో ఫీట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని ఆస్కా నిరంత‌రం ఇన్ స్టాలో షేర్ చేస్తూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇవ‌న్నీ జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.