Begin typing your search above and press return to search.

యంగ్ హీరో క్రేజీ మూవీ ఫస్ట్‌ లుక్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:23 AM GMT
యంగ్ హీరో క్రేజీ మూవీ ఫస్ట్‌ లుక్ వచ్చేసింది
X
తమిళ్ యంగ్‌ హీరో విష్ణు విశాల్ విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఒక కమర్షియల్‌ హీరో అని కాకుండా మంచి నటుడిగా ఈయన పేరు దక్కించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా పలు సినిమాల ద్వారా సుపరిచితుడు అయిన విష్ణు విశాల్‌ ప్రస్తుతం ప్రవీణ్ కే దర్శకత్వంలో A.A.R.Y.A.N అనే సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్ లో సీరియస్ పోలీస్‌ ఆఫీసర్ గా విశాల్‌ విష్ణు కనిపిస్తున్నాడు. గతంలో ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి విభిన్న పాత్రల్లో కనిపించిన ఈయన ఈ సినిమాలో పోలీసుగా మరింత మందికి చేరువ అవుతాడు అంటూ తమిళ మీడియా కథనాల్లో పేర్కొంటుంది.

సినిమా టైటిల్ మొదలుకుని మేకింగ్‌ వరకు ప్రతి విషయంలో కూడా కొత్తదనం కనిపిస్తుందని.. తప్పకుండా తమిళ్‌ సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఈ సినిమా అన్ని భాషల వారికి నచ్చుతుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లుగా వారు తెలియజేశారు.

ఈ సినిమా లో శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్ లు విష్ణు విశాల్‌ కి జోడీగా నటిస్తున్నారు. విశాల్‌ సొంత బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా యొక్క స్క్రీన్‌ ప్లే మరియు కథలో ట్విస్ట్‌ లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో సాయి రోనక్... తారక్ పొన్నప్ప.. అభిషేక్ జోసెఫ్ జార్జ్.. మాలా పార్వతి లు కనిపించబోతున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.