Begin typing your search above and press return to search.

క్యాబరే డ్యాన్సర్‌.. ఆర్తి అగర్వాల్‌

By:  Tupaki Desk   |   26 May 2015 5:30 PM GMT
క్యాబరే డ్యాన్సర్‌.. ఆర్తి అగర్వాల్‌
X
ఆర్తి అగర్వాల్‌.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌. మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, నాగార్జున, తరుణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోల సరసన నాయికగా నటించింది ఈ ఎన్నారై బొమ్మ. అయితే అనూహ్యంగా తరుణ్‌తో ప్రేమాయణం విఫలమై ఆత్మహత్యాయత్నం వరకూ వెళ్లింది. మిగతా కథంతా తెలిసిందే.

అయితే ఇన్ని వైఫల్యాలు జీవితాన్ని వెంటాడినా ఆర్తి ఇంకా ముఖానికి రంగేసుకోవడం మానేయలేదు. అప్పట్లో శివనాగు దర్శకత్వంలో ఓ బాలల చిత్రంలో కథానాయికగా నటించింది. ఇప్పుడు మరోసారి అదే దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈసారి నటిస్తున్న సినిమా కథే వేరు. చాలా ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌. అలనాటి మేటి డ్యాన్సర్‌ జయమాలిని జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నవలా రచయిత చల్లా సుబ్రహ్మణ్యం రచించిన 'క్యాబరెట్‌ డ్యాన్సర్‌' అన్న నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.

ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ఆర్తి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోంది. హలోబ్రదర్‌లో నాగార్జున అంత పెర్ఫామెన్స్‌ ఇస్తుందని శివనాగు చెబుతున్నారు. జూన్‌లో సెట్స్‌కెళ్లనున్నారు. ఈ చిత్రానికి రాజ్‌కిరణ్‌ ట్యూన్లు అందిస్తున్నారు. ఆర్తి కంబ్యాక్‌ సినిమా డర్టీ పిక్చర్‌ అంత సక్సెసవ్వాలని ఆశిద్దాం.