Begin typing your search above and press return to search.

ఆరడుగుల బుల్లెట్ ని చూపించేశాడు

By:  Tupaki Desk   |   23 April 2017 9:49 AM IST
ఆరడుగుల బుల్లెట్ ని చూపించేశాడు
X
గోపీచంద్ ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేలా సినిమా టైటిల్స్ ఎంచుకుంటున్నాడు. గౌతమ్ నందా అనే మూవీ ఇప్పటికే చేస్తుండగా.. ఇప్పుడు మరో సినిమాకు ఆరడుగుల బుల్లెట్ అనే టైటిల్ ఖాయం చేశారు. సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తో.. కొన్నేళ్ల క్రితమే ఓ సినిమా స్టార్ట్ చేశాడు గోపీచంద్.

అయితే.. దాదాపుగా షూటింగ్ పూర్తయిపోయిన ఈ చిత్రం కొంతకాలం పాటు రిలీజ్ ఆగిపోయింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఎట్టకేలకు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడీ ఆరడుగుల బుల్లెట్ కు ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేసేశారు మేకర్స్. తాండ్ర రమేష్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. క్లాస్ టచ్ తో న్న మాస్ హీరోగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూపర్బ్ గా ఉన్నాడు గోపీ చంద్. టక్ చేసుకుని.. కళ్లజోడు పెట్టుకుని.. క్లీన్ షేవ్ తో లుక్ క్లాస్ గా ఉన్నా.. వెనకాల ఉన్న అట్మాస్ఫియర్ అదీ చూస్తుంటే మాత్రం.. మాంచి మాస్ మసాలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరున్న బి. గోపాల్ రూపొందించిన మూవీ కావడంతో.. బీ సీ సెంటర్లను బాగానే అట్రాక్ట్ చేసే అవకాశాలున్నాయి. అయితే.. ఇన్నాళ్లు ఆగిపోయిన ఈ సినిమా విడుదలకు పీవీపీ హ్యాండ్ పడిందనే టాక్ వినిపించింది కానీ.. పోస్టర్ లో మాత్రం ఎక్కడా పేరు పడలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/