Begin typing your search above and press return to search.

నాకు కరోనా వచ్చింది : ప్రముఖ డైరెక్టర్

By:  Tupaki Desk   |   31 Dec 2020 2:51 PM IST
నాకు కరోనా వచ్చింది : ప్రముఖ డైరెక్టర్
X
కరోనా తీవ్రత మళ్లీ మొదలైంది. ఈ మహమ్మారి సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. ఈ జాబితాలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీరిలో తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్‌ చేరారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అని ప్రకటించారు.

అయితే.. తనకు ఎలాంటి లక్షణాలూ లేవని, బాగానే ఉన్నానని తెలిపారు. అధికారుల సూచన మేరకు క్వారెంటైన్‌లో ఉన్నానని చెప్పారు. కాగా.. ఆయన ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ లీడ్ రోల్స్‌లో ‘అత్రంగి రే’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుండగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రీసెంట్‌గా తనతో టచ్‌లో ఉన్నవారు దయచేసి కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉండాలని కోరారు. గవర్నమెంట్ ప్రొటోకాల్స్ తప్పకుండా పాటించాలన్నారు.

కాగా.. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకూ అన్ని సినిమా ఇండస్ట్రీలకు చెందిన వారు సుమారు 50 మంది వరకు మరణించారు. మళ్లీ కేసులు పెరుగుతుండడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో పలువురికి కరోనా సోకగా.. లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రామ్ చరణ్, వరుణ్ తేజ్ తమకు కరోనా నిర్ధారణ అయ్యిందని, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నామని ప్రకటించారు.