Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై అమీర్ ప్యార్!

By:  Tupaki Desk   |   2 Aug 2022 2:30 AM GMT
టాలీవుడ్ పై అమీర్ ప్యార్!
X
ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్ సినీ ప్రముఖులు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కొందరిలో ప్రత్యేకమైన గౌరవం ఉన్నప్పటికీ కూడా అదేమీ అంత పెద్ద ఇండస్ట్రీ కాదు అనే ఆలోచనతోనే ఉండేవారు.

కానీ ప్రస్తుత కాలంలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడమే కాకుండా మార్కెట్ వాల్యూ కూడా బాలీవుడ్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఇక్కడ వచ్చి ప్రమోషన్స్ చేస్తూ ఉండడం విశేషం.

కమర్షియల్ గా ఆలోచించి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి అని అంతేకాకుండా మార్కెట్ వాల్యూ కూడా పెంచుకోవాలి అని వివిధ రకాలుగా ఆలోచించి టాలీవుడ్ పై కాస్త ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక టాలెంటెడ్ నటుడు అమిర్ ఖాన్ కూడా గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో కంటే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపించడం విశేషం.

అతని తర్వాత రాబోయే చిత్రం లాల్ సింగ్ చడ్డా సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విదల కాబోతోంది. ఇక తెలుగులో అయితే ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదల చేస్తూ ఉండడం విశేషం. అయితే ఈ క్రమంలో అమీర్ ఖాన్ బాలీవుడ్ కంటే తెలుగులోనే ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పటికే చాలాసార్లు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన అమీర్ ఖాన్ స్పెషల్ ప్రోమో లు కూడా వదిలాడు.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాను అవసరమైతే దర్శకుడుగా నిర్మాతగా కూడా మారతాను అంటూ తనలోని ప్రేమను చాటుకున్నట్లు ఇటీవల ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.

చూస్తూ ఉంటే అమీర్ ఖాన్ మెగాస్టార్ దగ్గరగా ఉంటూ ఆయన అభిమానులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ మెగాస్టార్ తోనే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేలా ఉన్నారని కూడా అనిపిస్తోంది. మరి అమీర్ ఖాన్ తెలుగు ప్రేమ ప్రయాణం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందో లేదో చూడాలి.