Begin typing your search above and press return to search.

ఆ ఇల్లు మాత్రం కొనలేకపోతున్న అమీర్

By:  Tupaki Desk   |   23 April 2016 9:50 AM IST
ఆ ఇల్లు మాత్రం కొనలేకపోతున్న అమీర్
X
ఓ ఇల్లు కొనడం అంటే సామాన్యులకు కష్టమేమో కానీ.. సినిమాకి 40-50 కోట్లు రెమ్యూనరేషన్ అందుకునే అమీర్ ఖాన్ లాంటి స్టార్ కి పెద్ద కష్టమా అనిపించక మానదు. ఎందుకంటే ఈ స్టార్లు ఓ ప్రోగ్రాంకి వచ్చి, ఓ పూట గడిపితేనే ఓ కోటి ముట్ట చెప్పాల్సిన పరిస్థితి. అలాంటి అమీర్ ఖాన్.. ఒక్క కోరిక మాత్రం నెరవేర్చుకోలేకపోతున్నాడు.

మార్చ్ 14న తన పుట్టిన రోజున అమీర్ తన మనసులో కోరిక బయటపెట్టాడు. అదే తన తల్లి గతంలో నివసించిన ఇల్లు 'ఖ్వాజా మంజిల్'ను కొనుగోలు చేయడం. బెనారస్ లో అమీర్ తల్లి జీనత్ హుస్సేన్ నివశించిన ఇంటిని కొనుగోలు చేసేందుకు ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. చాలానే ప్రయత్నాలు చేశాడు. అయితే.. అడ్డంకులు తప్ప విషయం మాత్రం ఎంతకీ తెగడం లేదు.

ప్రస్తుతం అమీర్ కొందామని అనుకుంటున్న ఇల్లు లీగల్ వివాదంలో ఉంది. ఈ ఆస్తిపై ముగ్గురి మధ్య గొడవ నడుస్తోంది. దీన్ని చక్కదిద్దేందుకు అమీర్ అండ్ టీం ఎంత ప్రయత్నిస్తున్నా.. వారిలో ఒకరు మాత్రం ఎంతకీ లొంగడం లేదట. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. అమీర్ ఖాన్ కోరిక నెరవేరే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు.