Begin typing your search above and press return to search.

సన్నీ.. నేను రెడీ.. అంటున్న ఖాన్‌

By:  Tupaki Desk   |   20 Jan 2016 7:00 PM IST
సన్నీ.. నేను రెడీ.. అంటున్న ఖాన్‌
X
ఇంతకంటే తన జీవితంలో పెద్ద షాక్‌ ఉండదని చెప్పేసింది సన్నీ లియోన్‌. ఎందుకంటే తన ఫేవరేట్‌ హీరో ఇప్పుడు తనతో నటించడానికి సై అనేశాడు. అయితే ఇది కేవలం సంఘీభావం తెలపడానికే చేసిన వ్యాఖ్య అయినా కూడా.. ప్రస్తుత సిట్యుయేషన్‌ లో ఒక పెద్ద ఖాన్‌ ఇలా రెస్పాండ్‌ అవ్వడం కెవ్వు కేక అనిపించేలా ఉంది.

ఒక ప్రముఖ టివి ఛానల్‌ ఇంటర్యూ లో సన్నీ లియోన్‌ ఒక సీనియర్‌ జర్నలిస్టు దగ్గర నుండి ఎన్నో షాకింగ్‌ ప్రశ్నలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఒక ప్రశ్న ఏంటంటే.. ఒకవేళ అమీర్‌ ఖాన్‌ వంటి పెద్ద స్టార్‌ నీతో నటించడానికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావ్‌ అని అడిగారు సదరు పెద్దాయన. ''నేను అమీర్‌ ఖాన్‌ ఫ్యాన్‌ ను. ఆయన నాతో నటిస్తారా నటించరా అనేది ఆయన పర్సనల్‌. ఆయన నటించకపోయినా కూడా నేను ఆయన ఫ్యాన్ నే'' అని చెప్పింది సన్నీ లియోన్‌. ఈ టోటల్‌ యవ్వారంపై స్వయంగా అమీర్‌ ఖాన్‌ స్పందించేశాడు.

''సన్నీ.. నీతో కలిసి పనిచేయడం ఆనందిస్తాను. ఇంటర్వ్యూ యర్ అడిగినట్టు నీ 'గతం'తో నాకు ఎలాంటి సమస్య లేదు'' అంటూ అమీర్‌ ఖాన్‌ ఈరోజు మద్యాహ్నం ట్వీట్‌ చేశాడు. ''ఆ ఇంటర్వ్యూ లో ఎంతో హుందాగా, సహనశీలంగా సన్నీ ప్రవర్తించింది. అక్కడ నేనున్నా ఇంటర్వ్యూ యర్‌ కి ఇవే సమాధానాలు చెప్పాలనుకునేవాడిని..'' అంటూ చెప్పకొచ్చాడు మిష్టర్‌ పర్ ఫెక్ట్‌. ఈ ట్వీట్ల దెబ్బతో సన్నీ ఫుల్‌ ఖుషీ అయిపోయింది.