Begin typing your search above and press return to search.

మ్యూజిక్ మొఘ‌ల్‌ బ‌యోపిక్‌

By:  Tupaki Desk   |   27 July 2018 1:30 AM GMT
మ్యూజిక్ మొఘ‌ల్‌ బ‌యోపిక్‌
X
కాళ్ల‌కు చెప్పుల్లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చామ‌ని గొప్ప‌లు చెప్పేవాళ్లెంద‌రో. కానీ అలాంటి వాళ్ల బ‌యోపిక్‌లు తెలుగులో తీస్తున్న వైనం క‌నిపించ‌దు. ఎన్టీఆర్‌, వైయస్సార్ రేంజు వాళ్ల క‌థ‌లే కానీ కాళ్ల‌కు చెప్పులేకుండా వ‌చ్చి ద‌ర్శ‌క‌ర‌త్న‌గా ఎదిగిన‌ దాస‌రి లాంటి వారి క‌థ‌లు బ‌యోపిక్‌ ల‌కు స‌రిపోవ‌డం లేదో ఏమో! ఇదివ‌ర‌కూ దాస‌రి బ‌యోపిక్ అంటూ హ‌డావుడి చేసినా ఇంత‌వ‌ర‌కూ మొద‌ల‌వ్వ‌లేదు. అదే బాలీవుడ్‌కి వెళితే సీనే వేరు!

అక్క‌డ‌.. పండ్ల ర‌సాల‌(ఫ్రూట్ జ్యూస్‌) దుకాణంతో జీవితం మొద‌లుపెట్టి, ఏకంగా బాలీవుడ్‌ లోనే అత్యంత క్రేజీగా టీ-సిరీస్ మ్యూజిక్ లేబుల్‌ ని ప్రారంభించే రేంజుకు ఎదిగిన మేటి మ్యూజిక్ లెజెండ్ - నిర్మాత‌ గుల్ష‌న్ కుమార్ జీవితాన్ని వెండితెర‌కెక్కించేందుకు బాలీవుడ్‌ లో స‌న్నాహాలు సాగుతున్నాయి. గుల్ష‌న్ పాత్ర‌లో కిలాడీ అక్ష‌య్ న‌టిస్తార‌ని - `మొఘ‌ల్` అనే టైటిల్‌ ని ఫిక్స్ చేసినా ఆ త‌ర్వాత అత‌డు ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో వాయిదా ప‌డింది. ఇప్పుడు మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ ఖాన్ స్వ‌యంగా బ‌రిలో దిగి టీ-సిరీస్ తో క‌లిసి అమీర్‌ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌ లోనే ఈ సినిమాని నిర్మించేందుకు రెడీ పూనుకున్నాడు. హీరో ఎవ‌రో ఇంకా తేలాల్సి ఉన్నా ద‌ర్శ‌కుడు ఫిక్స‌య్యాడు. జాలీ ఎల్ ఎల్‌ బీ ఫేం సుభాష్ క‌పూర్ ఈ క్రేజీ బ‌యోపిక్‌ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 2019 ప్రారంభంలో మొద‌లుపెట్టి, అదే ఏడాది చివ‌రిలో క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తార‌ట‌. పండ్ల‌ ర‌సాలు అమ్మేవాడు బాలీవుడ్‌ ని ఏలే రేంజుకు ఎదిగిన వైనం ఎంతో స్ఫూర్తిమంతం. అక్క‌డ ఏకంగా టీ-సిరీస్ లేబుల్‌ తో గుల్ష‌న్ వార‌సులు బ‌డా బ‌డా సినిమాల్ని నిర్మిస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. అందుకే ఈ బ‌యోపిక్ ఆస‌క్తి పెంచ‌నుంది.