Begin typing your search above and press return to search.
మిస్టర్ జీనియస్ పాత్ర కోసం మిస్టర్ పర్ఫెక్ట్
By: Tupaki Desk | 16 Feb 2021 6:00 AM ISTఇండియాలో చెస్ అనే పేరు చెప్పగానే మొదట వినిపించే పేర్లు విశ్వనాథ్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వనాథ్ ఆనంద్ పలు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి చెస్ లో ఇండియాకు అద్బుత విజయాలను తెచ్చి పెట్టాడు. ఎన్నో అద్బుత విజయాలను నమోదు చేసిన విశ్వనాథ్ ఆనంద్ కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు. అలాంటి వరల్డ్ ఛాంపియన్ జీవిత కథను ఆనంద్ ఎల్ రాయ్ సినిమాగా తీసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఇప్పటికే ధనుష్ హీరోగా విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ అనుకున్నాడు. కాని తమిళ ఇండస్ట్రీ నుండి మొదలుకుని హాలీవుడ్ వరకు ఆయనకు పదుల కొద్ది కమిట్ మెంట్స్ ఉన్నాయి. దాంతో సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.
ధనుష్ బిజీ షెడ్యూల్ కారణంగా విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ ప్రాజెక్ట్ బాలీవుడ్ మిస్టర్ ఫెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ వద్దకు వెళ్లిందట. మిస్టర్ జీనియస్ చెస్ ఛాంపియన్ విశ్వనాధ్ ఆనంద్ బయోపిక్ అంటే ఆ రేంజ్ నటుడు అయితేనే న్యాయం చేయగలడు అనే ఉద్దేశ్యంతో అమీర్ ఖాన్ వద్దకు తీసుకు వెళ్లారని అంటున్నారు. ఆయన కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీన్ ఖాన్ ప్రధాన పాత్రలో మిస్టర్ జీనియస్ ఆనంద్ విశ్వనాథ్ బయోపిక్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ధనుష్ ఈ ప్రాజెక్ట్ ను వదులుకోవడం పట్ల పలువురు ఆయన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప బయోపిక్ చేజేతుల వదులుకున్నావు అంటూ ధనుష్ పై కామెంట్స్ చేస్తున్నారు.