Begin typing your search above and press return to search.

హాలీవుడ్ స్టార్స్ కి మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ స్పెష‌ల్ పార్టీ!

By:  Tupaki Desk   |   21 July 2022 2:30 PM GMT
హాలీవుడ్ స్టార్స్ కి మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ స్పెష‌ల్ పార్టీ!
X
ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కులు రూసో బ్ర‌ద‌ర్స్ ఆంటోనీ రుసో, జోయ్ రుసో ద్వ‌యం తెర‌కెక్కించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ `ది గ్రే మ్యాన్‌`. ది గ్రే మ్యాన్ న‌వ‌ల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ర్యాన్‌ గోస్లింగ్‌, పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొంది ఈ సినిమా జూలై 22న శుక్ర‌వారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్‌ల‌తో పాటు ఇండియ‌న్ స్టార్‌, త‌మిళ హీరో ధ‌నుష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇటీవ‌లే ఈ మూవీ ప్రీమియ‌ర్ ని ఏర్పాటు చేయ‌గా హీరో ధ‌నుష్ ఇందు కోసం త‌న ఇద్ద‌రు త‌న‌యుల‌తో క‌లిసి వెళ్లి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వ‌చ్చాయి. రిలీజ్ కు ముందే టాక్ మిక్స్డ్ గా వుండ‌టంతో ధ‌నుష్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌. ధ‌నుష్ న‌టించిన రెండ‌వ హాలీవుడ్ మూవీ ఇది. ఇది కూడా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకోవ‌డంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గుర‌వుతున్న‌ట్టుగా చెబుతున్నారు.

తొమ్మిదేళ్ల శ్ర‌మ‌కు నిద‌ర్శ‌నంగా నిలిచిన ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం తొలి సారి హాలీవుడ్ డైరెక్ట‌ర్స్ రుసో బ్ర‌ద‌ర్స్ ఇండియా రావ‌డం విశేషం. లాస్ ఏంజిల్స్‌, ఫ్రాన్స్‌, చెక్ రిప‌బ్లిక్‌, థాయిలాండ్‌, క్రొయేషియా, ఆస్ట్రియా, అజ‌ర్ బైజాన్ స‌హా ఏడు దేశాల్లోని వివిధ లొకేష‌న్ ల‌లో ఈ మూవీని రూపొందించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీకి భార‌త్ లో ధ‌నుష్ న‌టించిన కార‌ణంగా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే భార‌త్ లో ప్ర‌మోష‌న్స్ కోసం రూసో బ్ర‌ద‌ర్స్ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కోసం స్పెష‌ల్ ప్రీమియ‌ర్ ని రుసో బ్ర‌ద‌ర్స్ ప్లాన్ చేశార‌ట‌. అయితే `లాల్ సింగ్ చ‌ద్దా` రిలీజ్ ప్ర‌మోషన్స్ లో బిజీగా వున్న అమీర్ వెళ్ల‌లేక‌పోయార‌ట‌. అయితే ఇందుకు గానూ రుసో బ్ర‌ద‌ర్స్ ని త‌న ఇంటికి డిన్న‌ర్ కి ఆహ్వానించాడ‌ట‌. ఈ విందులో ధ‌నుష్ తో పాటు అమీర్ ఖాన్ మాజీ భార్య కిర‌ణ్ రావు కూడా పాల్గొన్నారు.

ఇందులో విశేషం ఏంటంటే గుజ‌రాతీ వంట‌కాల‌తో రుసో బ్ర‌ద‌ర్స్ అండ్ టీమ్ కి అమీర్ ఖాన్ డిన్న‌ర్ ఏర్పాటు చేయ‌డం విశేషంగా చెబుతున్నారు. ప్ర‌త్యేక చెఫ్ ల‌ని తీసుకొచ్చిన అమీర్ వారితో ప్ర‌త్యేకంగా గుజ‌రాతీ వంటకాల‌ని చేయించారు. ఖాండ్ పూరి, టువేరీ లిఫాఫా, పాప‌డ్ లువా ప‌టోడి వంటి వంట‌కాల‌ని రుసో బ్ర‌ద‌ర్స్ కోసం ప్ర‌త్యేకంగా చేయించి ప‌సందైన డిన్న‌ర్ ని ఏర్పాటు చేయ‌డం విశేషంగా చెబుతున్నారు.