Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ నట వారసుడు 'మహారాజ'

By:  Tupaki Desk   |   12 Jun 2022 1:30 AM GMT
సూపర్ స్టార్‌ నట వారసుడు మహారాజ
X
సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా కామన్‌ విషయం. ముఖ్యంగా బాలీవుడ్‌ లో వారసుల ఎంట్రీ గురించి రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. హిందీ సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం వారసులే ఉన్నారు. బాలీవుడ్ లో మరో నట వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆయన మహారాజ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మిస్టర్ పర్ఫెక్ట్‌ అమీర్ ఖాన్‌ తనయుడు జునైద్ ఖాన్‌ హీరోగా ఎంట్రీకి సిద్దం అయ్యాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈయన ఎంట్రీ గురించిన వార్తలు మీడియాలో వింటూనే ఉన్నాం. అయితే కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈయన సినిమా పట్టాలెక్కింది.

హీరోగా జునైద్‌ ఖాన్ నటిస్తున్న సినిమా గురించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆ సినిమా కు టైటిల్ గా మహారాజా ను ఖరారు చేశారట. సినిమా టైటిల్ కు తగ్గట్లుగా హీరో పాత్ర ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ తనయుడికి సెట్‌ అయ్యే టైటిల్‌ ఇంతకు మించి ఉండక పోవచ్చు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో మరియు అభిమానుల్లో ప్రస్తుతం జునైద్‌ ఖాన్‌ ఎంట్రీ మూవీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. మహారాజ టైటిల్ తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

ఈ సినిమా కు సిద్దార్థ్ మల్హోత్ర దర్శకత్వం వహిస్తుండగా యశ్ రాజ్ ఫిల్మ్స్ లో భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. మహారాజ సినిమా ఇదే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక అమీర్ ఖాన్‌ సినిమాల విషయానికి వస్తే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది విడుదల కావాల్సి ఉన్నా కూడా వాయిదా వేశారు. త్వరలో లాల్ సింగ్‌ చద్దా విడుదల కాబోతుందట. ఈ సినిమాలో మన యంగ్‌ హీరో నాగ చైతన్య నటించిన విషయం తెల్సిందే.