Begin typing your search above and press return to search.

మచ్చ చెరిపేసుకోవడానికి అమీర్ ఖాన్ పాట్లు

By:  Tupaki Desk   |   31 Jan 2016 3:03 PM IST
మచ్చ చెరిపేసుకోవడానికి అమీర్ ఖాన్ పాట్లు
X
ఇంతకాలం యావత్ భారతదేశం అభిమానించిన అమీర్ ఖాన్ ఇప్పుడు ఆ స్థాయిలో ఆదరణ, అభిమానాన్ని అందుకోలేకపోతున్నారు. గత ఏడాది అసహనం నేపథ్యంలో ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు భారతీయులను ఎంతగానో బాధించాయి. ప్రభుత్వం కూడా దాన్ని ఎంతో సీరియస్ గా తీసుకుంది. ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి ఆయన్ను తప్పించింది. బాలీవుడ్ లోనూ చాలామంది అమీర్ తీరును తప్పు పట్టారు. అనుపమ్ ఖేర్, ప్రియాంక చోప్రా వంటి వారు నేరుగా అమీర్ పై విమర్శలు గుప్పించారు. తన మాటలపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర వ్యతిరేకత అమీర్ కు వెంటనే అర్థమైంది. అది తనకు తీవ్ర నష్టం కలిగించబోతుందని కూడా అర్తమైంది. అందుకే ఆ తరువాత ఆయన తన దేశభక్తిని చాటుకునేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా విశాఖలో ప్రో కబడ్డీ పోటీల ప్రారంభానికి వచ్చిన సందర్భంలోనూ ఆయన దేశభక్తి ప్రదర్శనకు తహతహలాడారు.

విశాఖలో ప్రో కబడ్డీ పోటీలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన తొడగొట్టి ఆశ్చర్యపరిస్తే నిండా అసహనం నింపుకున్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ జాతీయ గీతాన్ని ఆలపించేందుకు ఉత్సాహపడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమీర్ జాతీయ గీతాన్ని పాడడంలో వింతేమీ లేకపోయినా ఆయన ఇటీవల చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో అది ప్రాధాన్యం సంతరించుకుంది. తన దేశభక్తిని ప్రదర్శించుకోవడానికి, గతంలో చేసిన పొరపాటు వల్ల ఏర్పడిన మచ్చను పోగొట్టుకోవడానికి ఆయన తాపత్రయ పడుతున్నట్లు అక్కడ స్పష్టంగా అర్తమైంది. అమీర్ లో పశ్చాత్తాపం కలిగితే చాలు.