Begin typing your search above and press return to search.

కథ మొదలయ్యేదే రైటర్ నుంచి

By:  Tupaki Desk   |   27 Nov 2018 6:14 PM IST
కథ మొదలయ్యేదే రైటర్ నుంచి
X
మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు విభిన్నమైన సినిమాలను అందించాలనే తపన పడుతుంటాడు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్. ఈమధ్య రిలీజ్ అయిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' రిజల్ట్ అటూ ఇటూ అయినా ఆమిర్ ఖాన్ ప్రయత్నాన్ని మనం తక్కువ చెయ్యలేం. రీసెంట్ గా ఆమిర్ ఖాన్ సినీస్తాన్ ఇండియా స్టొరీ టెల్లర్ స్క్రిప్ట్ కాంటెస్ట్ 2018 గ్రాండ్ ఫినాలే లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా అయన రచయతల ప్రాముఖ్యత గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.

ఈ ఈవెంట్ ద్వారా అంజుమ్ రాజబలి దేశంలోని చాలామంది టాలెంటెడ్ రైటర్లకు ఒక ప్లాట్ ఫామ్ కల్పిస్తున్నాడు. ఫిలిం ఇండస్ట్రీకోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడం అవసరం అన్నాడు. రచయితలు మంచి కథలతో వచ్చేందుకు దానికి తగ్గ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని అడిగితే.. "ఔత్సాహిక రచయితలకు ఈ పోటీలు చాలా ఎంకరేజ్ మెంట్ ఇస్తాయి. ఇంతటితో ఆగకుండా ప్రొడ్యూసర్లుగా మనం రచయితలకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలి" అన్నాడు.

తను ఏ సినిమానైనా స్క్రిప్ట్ అధారంగానే ఎంచుకుంటానని.. అందుకే ఫిలిం ఫిలిం మేకింగ్ లో అతిముఖ్యమైన పాత్ర రైటర్లదేనని తేల్చి చెప్పాడు. ఒక రచయిత మంచి స్క్రిప్ట్ తో వస్తే తామందంరం ఆ సినిమాలో భాగం అవుతామని అన్నాడు. అలా చూసినప్పుడు అసలు ప్రాసెస్ మొదలయ్యేదే రైటర్ దగ్గరనుండి అన్నాడు. సినిమా అనేది డైరెక్టర్ మీడియమ్.. ఎందుకంటే డైరెక్టరే కథను ప్రేక్షకులకు చెప్తాడు. ఆ విషయం తనకు తెలుసనీ కానీ.. ఆ కథ మొదలయ్యేదే రైటర్ నుంచి కాబట్టి ఆ రచయితకు మంచి రెమ్యునరేషన్ ఇవ్వాలని అన్నాడు.