Begin typing your search above and press return to search.

ఇంత గట్స్ తో మాట్లాడే హీరో ఎవరు

By:  Tupaki Desk   |   28 May 2018 11:00 PM IST
ఇంత గట్స్ తో మాట్లాడే హీరో ఎవరు
X
బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగినా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో అందరిని ఆకట్టుకుం హీరో అమీర్ ఖాన్. చేతలే కాదు మాటలు కూడా అదే స్పష్టం చేస్తాయి. కథ ఎలా డిమాండ్ చేస్తే అలా తనను తాను మార్చుకుని నటిస్తాడు అనే పేరున్న అమీర్ ఖాన్ తనను న్యాచురల్ స్టార్ అంటే ఒప్పుకోవడం లేదు. తనది సహజమైన నటన కాదని చాలా కష్టపడి నెలల తరబడి ప్రాక్టీస్ చేస్తేనే ఏ సినిమా అయినా చేసే ధైర్యం తనకు వస్తుందని చెప్పాడు. నసీరుద్దీన్ షా-ఓంపురి-అమితాబ్ లాంటి దిగ్గజాల ముందు తనెంత అంటున్న అమీర్ ఖాన్ ఆఖరికి తన కంటే దంగల్ లో నటించిన జైరా వసీం గురించి ఇంకా ఎక్కువ చెప్పాడు. దంగల్ సినిమా కోసం హర్యాని యాసలో మాట్లాడ్డం నేర్చుకోవడానికి తనకు నాలుగు నెలల సమయం పడితే కూతురిగా నటించిన జైరా వసీంకు కేవలం రోజులు మాత్రమే పట్టిందని చెప్పాడు. దీన్ని బట్టి ఏవైనా కొత్తవి నేర్చుకునే విషయంలో తానెంత వీక్ అనేది అర్థం చేసుకోమని కోరుతున్నాడు.

షూటింగ్ ప్రారంభానికి ముందు కనీసం మూడు నుంచి నాలుగు నెలలు పాత్రకు సంబంధించిన ప్రాక్టీస్ చేస్తానని లగాన్ సినిమా కోసం వర్క్ అవుట్ చేస్తున్నప్పుడు తన కన్నా రఘు బీర్ సింగ్ బాగా చేయటం ఇప్పటికీ గుర్తుందని చెప్పాడు. ఇలా చాలా మెరుగ్గా తనకంటే బాగా చేసేవాళ్ళు ఎందరో ఉండగా నేనే బెస్ట్ అని ఎలా అంటానని రివర్స్ లో ప్రశ్నించాడు. ముప్పై ఏళ్ళ కెరీర్ ని ఇటీవలే పూర్త చేసుకున్న అమీర్ ఖాన్ వయసు పరంగా 50 దాటేశాడు. అయినా పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైన ఓర్చుకోవడం అమీర్ కు అలవాటే. బాడీ డూపులను పెట్టుకుని కూడా అదేదో సొంత ఫైట్ చేస్తున్నామని బిల్డప్ ఇస్తున్న కొందరు హీరోల కంటే ట్రాన్స్పరెంట్ గా అమీర్ ఖాన్ తన బలహీనతలు తనే చెప్పుకోవడం అందరిని ఆకర్షిస్తోంది