Begin typing your search above and press return to search.

మిస్టర్ పర్ఫెక్ట్ కి నచ్చేసిన లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   30 Oct 2016 10:13 AM IST
మిస్టర్ పర్ఫెక్ట్ కి నచ్చేసిన లవ్ స్టోరీ
X
బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్మించి దర్శకత్వం వహించిన 'యే దిల్ హై ముష్కిల్' థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ మెచ్యూర్డ్ లవ్ స్టోరీకి ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకూ చేయలేదనే ప్రశంసలు కూడా దక్కించుకుంటోంది ఈ చిత్రం.

ఇప్పుడు 'యే దిల్ హై ముష్కిల్'కు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. సూపర్ స్టార్ నుంచి దక్కిన అనుకోని పొగడ్తలతో ఫిలిం యూనిట్ అంతా ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది. 'జస్ట్ ఇప్పుడే యే దిల్ హై.. చూశా. వాటే ఫిలిం.. నాకు తెగ నచ్చేసింది. కరణ్ కొట్టిన షాట్ కి బాల్ స్టేడియం బైటకెళ్లి పడినట్లుగా అనిపించింది. రణబీర్.. ఐశ్వర్య.. అనుష్కలు చంపేశారంతే. రణబీర్ ఎంత బెస్ట్ యాక్టరో ప్రూవ్ అయింది. తప్పకుండా చూడాల్సిన మూవీ' అంటూ అమీర్ ఖాన్ ట్వీట్ చేశాడు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే మంచి కలెక్షన్స్ రాబడుతున్న యే దిల్ హై ముష్కిల్ కు.. స్టార్ హీరో అమీర్ ఖాన్ సపోర్ట్ లభించడంతో.. ఇప్పటికే పాజిటివ్ గా ఉన్న టాక్ మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు హెల్ప్ చేయనుంది. ముష్కిల్ అంటూనే.. యే దిల్ హై ముష్కిల్ టీం ఈజీగానే హిట్ కొట్టేసినట్లున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/