Begin typing your search above and press return to search.

బ్రేకప్ గొడవలో దూరిన అమీర్

By:  Tupaki Desk   |   19 April 2016 10:24 AM IST
బ్రేకప్ గొడవలో దూరిన అమీర్
X
బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ లు బ్రేకప్ చెప్పేసుకుని, అక్కడితో ఆగకుండా లీగల్ గొడవల వరకూ వెళ్లిపోయారు. రోజురోజుకూ ఈ వివాదం ముదరడమే తప్ప, బ్రేకప్ గోలకి బ్రేక్ మాత్రం పడ్డం లేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగేలా చేసేందుకు.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

హృతిక్ - కంగనాలు ఇద్దరికీ అమీర్ ఖాన్ బాగా క్లోజ్ అంటున్నారు. అమీర్ ఇంట్లో జరిగే ప్రతీ పార్టీకి కంగనాని పిలిచేంతటి రిలేషన్ ఉందిట. దీంతో ఆమెను చల్లబరిచేందుకు ప్రయత్నిస్తున్నాడట అమీర్. మరోవైపు హృతిక్ రోషన్ కి కూడా పబ్లిక్ గా గొడవలు వద్దని వారిస్తున్నాడట అమీర్. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో.. అమీర్ ఖాన్ రెండు వెర్షన్లు తెలుసని, అందుకే శాంతిదూతగా మారేందుకు ట్రై చేస్తున్నాడని అంటున్నారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ లో కంగనా - అమీర్ లు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అమీర్ ఖాన్ చెప్పిన సుద్దులతో.. ఇక వీరిద్దరూ తమ గొడవను వదిలేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఓ జంట గొడవ తీర్చడానికి పీకే దిగిరావాల్సి వచ్చింది.