Begin typing your search above and press return to search.

ముంబై మాఫియా మ‌ర్డ‌ర్ చేసిన‌ లెజెండ్ పై బ‌యోపిక్

By:  Tupaki Desk   |   10 Sep 2019 7:15 AM GMT
ముంబై మాఫియా మ‌ర్డ‌ర్ చేసిన‌ లెజెండ్ పై బ‌యోపిక్
X
మ‌హాభార‌తం సిరీస్ ఐదు భాగాలుగా తీస్తాన‌ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఆ క్ర‌మంలోనే ఎంద‌రికో స్ఫూర్తి ప్ర‌దాత‌ టీసిరీస్ అధినేత గుల్ష‌న్ కుమార్ బ‌యోపిక్ పైనా గురి పెట్టాడు. కానీ ఇంత‌లోనే ఏమైందో ఆ రెండిటికి తూచ్ అన్నాడు. కానీ మ‌ళ్లీ ఏమైందో .. ఆ బ‌యోపిక్ ని తెర‌పైకి తెస్తున్నాడు. అస‌లు మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి ఏమైంది?

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ ఫెక్ట్ అని అమీర్ ఖాన్ లేటెస్ట్ డైల‌మా స‌న్నివేశం గురించి తెలిసిందే. తాను ఏది చేసినా ప‌ర్ ఫెక్ట్ గా ఉండాల‌ని త‌పించే ఆయ‌న‌కు థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ రూపంలో పెద్ద జోల్ట్ త‌గిలింది. మ‌హాభార‌తం తీయాల‌నుకున్నా మ‌త సంబంధ‌మైన చిక్కులు రాజ‌కీయ అంశాలతో చిక్కులేమిట‌న్న‌ది విశ్లేషిస్తే త‌న‌ని చాలానే భ‌య‌పెట్టాయి. ఆ క్ర‌మంలోనే అమీర్ లో డైల‌మా అంత‌కంత‌కు ఇబ్బందిక‌రంగా మారింది. అందుకే ఇప్పుడు ఎంచుకునే స్క్రిప్టు విష‌యంలో ఎంతో ఆచితూచి అడుగులేస్తున్నారు.

ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ చేశాక‌.. సినిమా కోసం క‌ఠోరంగా శ్ర‌మించే అమీర్‌ఖాన్ త‌న చుట్టూ వుండే వాతావ‌ర‌ణం కూడా ప‌ర్ ఫెక్ట్ గా క్లీన్ గా వుండాల‌ని కోరుకుంటారు. అలా వుండేలా చూసుకుంటారు కూడా. టీ సిరీస్ అధినేత గుల్ష‌న్ కుమార్ జీవిత క‌థ ఆధారంగా `మోఘ‌ల్‌` పేరుతో ఓ సినిమా చేయాల‌ని ఏడాది క్రితం అమీర్‌ఖాన్ ప్లాన్ చేశారు. అయితే అదే స‌మ‌యంలో మొఘ‌ల్ చిత్రం తీయాల‌నుకున్న ద‌ర్శ‌కుడు సుభాష్ క‌పూర్ పై మీటూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

అయితే తాజాగా గుల్ష‌న్ కుమార్ బ‌యోపిక్ ని చేయ‌బోతున్నానంటూ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మీటూ ఉద్య‌మానికి తన‌ స‌పోర్ట్ ఎప్పుడూ వుంటుంద‌ని చెప్పినా.. గుల్ష‌న్ కుమార్ బ‌యోపిక్ విష‌యంలో మాత్రం నా హార్ట్ చెప్పింది విన్నాన‌ని.. అందుకే ఆయ‌న బ‌యోపిక్ ని నిర్మించ‌డానికి ముందుకొచ్చాన‌ని అమీర్ చెప్ప‌డం విశేషం. ముందు గుల్ష‌న్ కుమార్ పాత్ర కోసం అక్ష‌య్ కుమార్ ని సంప్ర‌దించిన అమీర్ అత‌ను న‌టించ‌డానికి సుముఖంగా లేక‌పోవ‌డంతో ఆ ఆఫ‌ర్ ని వ‌రుణ్ ధావ‌న్ కి ఇచ్చాడు. అయితే వ‌రుణ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా వుండ‌టంతో తానే లైన్ లోకి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ``ఈ పాత్ర చేయాల‌ని రాసి పెట్టి ఉంది. అందుకే మీ దాకా వ‌చ్చింది`` అని గుల్ష‌న్ కుమార్ కొడుకు.. చిత్ర నిర్మాత‌ చెప్ప‌డంతో వెంట‌నే అంగీక‌రించాన‌ని అమీర్ చెబుతున్నాడు. ప్ర‌స్తుతం అమీర్ న‌టిస్తున్న‌ `లాల్ సింగ్ చ‌ద్దా` పూర్తి కాగానే `మోఘ‌ల్‌`ని ప‌ట్టాలెక్కిస్తార‌ట‌. ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ డీ కంపెనీ చేతిలో హ‌త‌మైన గుల్ష‌న్ కుమార్ చ‌రిత్ర ఎంతో స్ఫూర్తివంత‌మైన‌ద‌ని చెబుతారు. జ్యూస్ అమ్మే షాప్ లో ప‌ని చేసిన ఒక సాధార‌ణ యువ‌కుడు అంచెలంచెలుగా ఎదిగి మ్యూజిక్ లేబుల్ కంపెనీ టీ సిరీస్ ని ప్రారంభించి బాలీవుడ్ లో నిర్మాత‌గానూ ఎదిగారు. అదేమీ ఆషామాషీ జ‌ర్నీ కానేకాద‌ని చెబుతారు. టీసిరీస్ తో క‌లిసి అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించే ఈ చిత్రంలో అమీర్ టైటిల్ పాత్ర పోషిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సుభాష్ అమీర్ కి ఎంతో స‌న్నిహితుడు.. స్నేహితుడు. అందుకే అత‌డిపై మీటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు నిద్ర ప‌ట్ట‌లేద‌ని అమీర్ తాజా స్టేట్ మెంట్లో తెలిపారు. స్నేహితుడిపై వేధింపుల‌ ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఇప్పుడు ఈ సినిమాని ప‌ట్టాలెక్కించేందుకే నిర్ణ‌యించుకున్నాన‌ని అన‌డం మ‌రో ట్విస్ట్.